స్పృహ తప్పిపడిపోయిన సీతక్క
BY Admin21 Sept 2021 5:47 PM IST

X
Admin21 Sept 2021 5:47 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర యాత్రలో పాల్గొన్న ఆమె స్పృహ తప్పిపడిపోయారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర యాత్రలో పాల్గొన్న సీతక్క నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అక్కడ తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకొని తహసీల్దార్‌కు మెమోరండం ఇచ్చిన అనంతరం అస్వస్థకు గురయ్యారు. దీంతో కార్యకర్తలు ఆమెను హుటాహుటిన స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బీపీ డౌన్ అయినందువల్లే సీతక్క పడిపోయినట్లు చెబుతున్నారు.
Next Story



