Telugu Gateway
Telangana

కెసీఆర్ కు ఇప్పుడు రెండు సవాళ్లు!

కెసీఆర్ కు ఇప్పుడు రెండు సవాళ్లు!
X

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ కు ఇప్పటి వరకూ అందరూ రాజకీయ సవాళ్లే అనుకున్నారు. ఇప్పుడు ఆర్ధిక సవాళ్లు కూడా తోడు అయ్యాయి. ఈ రెండు సవాళ్లను అధిగమించటం అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వానికి అయినా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు సీఎం కెసీఆర్ దీ అదే పరిస్థితి. అందుకే ఎన్నడూలేని రీతిలో తొలిసారి మూడవ సారి విజయం కోసం ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా పెట్టుకున్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో కొత్తగా తీవ్ర రూపం దాల్చిన ఆర్ధిక సవాళ్ళు రాజకీయంగా కూడా కెసీఆర్ సర్కారుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కన్పిస్తోంది. ఇదే జరిగితే రాజకీయంగా ఆయన మరింత ప్రమాదంలో పడినట్లే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.గత కొన్ని నెలలుగా కేంద్రం ఆకస్మాత్తుగా ఆర్ బిఐ వేలం ద్వారా సేకరించే అప్పులపై ఆంక్షలు పెట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా అన్న అంశంపై తర్జనభర్జనలు పడుతోంది సర్కారు.

సాధ్యం కాదనుకున్న రాష్ట్రాన్ని తెచ్చిన తమకు అప్పులు తేవటం పెద్ద కష్టమా అని మంత్రి పువ్వాడ అ జయ్ రాజకీయ ప్రకటన అయితే చేశారు కానీ..ఇది అంత ఆషామాషీగా జరిగే వ్యవహారం కాదన్న సంగతి వాళ్లకూ తెలుసని అధికార వర్గాల వ్యాఖ్యానిస్తున్నాయి. పరపతి పోయిన ప్రభుత్వానికి అయినా..వ్యక్తులకు అ యినా అ ప్పులు పుట్టవనే విషయం తెలిసిందే. కేంద్రం. ఆర్ బి ఐ అప్పులకు నో చెప్పిన తర్వాత ఎవరైనా..ఎందుకు తెలంగాణ సర్కారుకు అప్పు ఇస్తారు.ఇది ఏమైనా సీఎం కెసీఆర్, మంత్రుల వ్యక్తిగత వ్యవహారం కాదు కదా అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. రాజ‌కీయంగా టీఆర్ఎస్. కెసీఆర్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో ఆర్ధిక స‌మ‌స్య‌లు కూడా తోడు కావ‌టంతో ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Next Story
Share it