Telugu Gateway
Telangana

సీఎం కెసీఆర్ కు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్

సీఎం కెసీఆర్ కు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్
X

ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం నాడు యశోదా ఆస్పత్రిలో వైద్య పరీ క్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కెసీఆర్ కు ఊపిరితిత్తుల్లో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందని గుర్తించినట్లు డాక్టర్ ఎం వీ రావు తెలిపారు. ప్రతి ఏటా చలికాలంలో ఈ సమస్య వస్తుందని..ఇది తప్ప ఆయనకు వేరే ఆరోగ్య సమస్యలు లేవన్నారు. ఐదు రోజుల పాటు వాడేలా కెసీఆర్ కు మందులు ఇచ్చినట్లు ఎం వీ రావు తెలిపారు. మిగిలిన పరీక్షలకు సంబంధించి ఇంకా ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు గురువారం మద్యాహ్నం సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు.

సిఎం కేసీఆర్ కు ఊపిరితిత్తుల్లో మంట గా ఉండడంతో బుధవారం ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎం.వి. రావు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎం.ఆర్.ఐ, సిటి స్కాన్ లాంటి పరీక్షలు అవసరం కావడంతో, వాటిని గురువారం మద్యాహ్నం ఆసుపత్రిలో చేపట్టారు. ఎప్పుడూ ఇలాంటి విషయాలు రహస్యంగా ఉండే ప్రభుత్వం ఈ సారి ఈ విషయాలు బహిర్గతం చేయటం విశేషం.

Next Story
Share it