Top
Telugu Gateway

మీలాంటి కుక్కలు చాలా ఉన్నాయి..తొక్కిపడేస్తాం

మీలాంటి కుక్కలు చాలా ఉన్నాయి..తొక్కిపడేస్తాం
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ హాలియా సభలో ఆందోళన చేస్తున్న కొంత మంది ఆందోళనకారులపై తీవ్ర హెచ్చరికలు చేశారు. కొంత మంది ఏవో నినాదాలు చేస్తూ కేసీఆర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి దగ్గర ఉన్న పేపర్లు ఏవో తీసుకుని వాళ్లను బయటకు పంపాలని ఆదేశించారు. పోలీసులను వాళ్ళను బయటకు తీసుకెళ్ళాలన్నారు. ఈ సమయంలోనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'మీలాంటి కుక్కలు చాలా ఉన్నాయి ...వారిని తరిమేయండి .. పోలీసులు అరెస్ట్ చేయండి. పిచ్చిపనులు చేస్తే తొక్కి పడేస్తాం. సహనానికి కూడా హద్దు ఉంటుంది. కొత్త బిచ్చగాళ్ల లా కొద్దిమంది ప్రవర్తిస్తున్నారు.

మేము తలుచుకుంటే దుమ్ము దుమ్ము అయిపోతారు. ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలేదు. మీలాంటి వాళ్ళను చాలామందిని చూశాం. రైతుబాట కార్యక్రమం ఎందుకు...రైతులు బాగున్నందుకా...మీ హయాంలో రైతులకు ఎరువులు కూడా ఇవ్వలేదు.పెద్ద పెద్ద డైలాగులు కాంగ్రెస్ నాయకులు చెబుతారు.. కానీ అభివృద్ధి ఏమీ చేయలేదు. పిచ్చివాగుడు మానుకోవాలి అని బీజేపీ నాయకులకు చెబుతున్నా. కాంగ్రెస్ కు అసలు తెలంగాణను పేరు ఉచ్చరించే అర్హత లేదు. మేం ప్రజాతీర్పుతో వచ్చాం. ఎవరో ఢిల్లీలో నామినేట్ చేస్తే వచ్చినోళ్ళం కాదు. తెలంగాణలో జరిగిన అన్యాయాలు అన్నింటికి కాంగ్రెసే కారణం. ' అంటూ మండిపడ్డారు.

Next Story
Share it