Telugu Gateway
Telangana

తెలంగాణ కాశ్మీరం అవుతుంది

తెలంగాణ కాశ్మీరం అవుతుంది
X

ముఖ్య‌మంత్రి కెసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాల‌మూరు, సీతారామ ప్రాజెక్టులుపూర్త‌యితే తెలంగాణ కాశ్మీరం అవుతుంద‌న్నారు. తెలంగాణ ఎప్ప‌టికీ ధ‌నిక రాష్ట్ర‌మే అని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. కొన్ని దేశాలు తెలంగాణ వ‌చ్చి నేర్చుకుని పోతున్నాయ‌ని, దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ ఉన్నామ‌న్నారు. వాస్త‌వానికి ద‌ళిత బంధు ఏడాది క్రిత‌మే ప్రారంభం కావాల్సి ఉంద‌ని..క‌రోనా వ‌ల్ల ఆల‌శ్యం అయింద‌ని తెలిపారు. అనేక ఏళ్లుగా ద‌ళిత బంధుపై క‌స‌ర‌త్తు చేశామ‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ట్రంలో ఉద్యోగుల‌కు జీతాలు ఇస్తున్నామ‌న్నారు. దేశ జీడీపీ కంటే రాష్ట్ర జీఎస్ డీపీ ఎక్కువ అన్నారు. ఉద్య‌మం చివ‌ర్లో వ‌చ్చి తూతూమంత్రంగా పాల్గొన్న వాళ్లు ఇష్టానుసారం మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు.

ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌లు వెల్లువ‌లా రాష్ట్రానికి వ‌స్తున్నాయ‌న్నారు. మంచి ప్ర‌భుత్వం, మ‌న‌సున్న ప్ర‌భుత్వం ఉంటే ప్ర‌జ‌ల‌కు మంచి ప‌థ‌కాలు వ‌స్తాయ‌న్నారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరిక సంద‌ర్భంగా సీఎం కెసీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం పెద్దిరెడ్డికి గులాబీ కండువా వేసి పార్టీలోకి స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డిపై సీఎం కేసీఆర్‌ ప్రశంసలు కురిపించారు. తెలుగుదేశం పార్టీలో గతంలో తామిద్దరం కలిసి పని చేసినట్లు సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. పెద్దిరెడ్డి తనకు ఎంతో సన్నిహితులని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమంలో భాగస్వామ్యం కావడానికి నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Next Story
Share it