Telugu Gateway
Telangana

హరీష్ పై కెసీఆర్ ప్రశంసల వర్షం

హరీష్ పై కెసీఆర్ ప్రశంసల వర్షం
X

ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం నాడు సిద్ధిపేటలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సభలో మాట్లాడుతూ మంత్రి హరీష్ రావుపై ప్రశంసల వర్షం కురిపించారు. జిల్లాను మంత్రి హరీష్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తన పేరును నిలబెట్టాడని కొనియాడారు. సిద్ధిపేట నుంచి వెళ్ళేటప్పుడు ఆణిముత్యం లాంటి హరీష్ ను మీకు అప్పగించి వెళ్ళానని వ్యాఖ్యానించారు. తెలంగాణను సిద్ధింపచేసిన గడ్డ సిద్ధిపేట అని పేర్కొన్నారు. ఈ పేరులోనే ఏదో బలముందని అన్నారు. సిద్ధిపేట లేకపోతే కెసీఆర్ లేడు..కెసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని వ్యాఖ్యానించారు. సిద్ధిపేట ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా రెండు చోట్లా తాను విజయం సాధించానని..తెలంగాణ సాధనలో భాగంగా ఎంపీ పదవిలో కొనసాగి ఎమ్మెల్యేకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు.

సిద్ధిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసినప్పుడు ఎంతో బాధపడినట్లు తెలిపారు.అంతకు ముందు సీఎం కెసీఆర్ హరీశ్‌రావుతో కలిసి రూ.45 కోట్లతో సిద్ధిపేట శివారులో నిర్మించనున్న ఐటీ టవర్ నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. జిల్లాలో కరెంటు బాధలు, నీళ్ల బాధలు లేకుండా చేశామన్నారు. రంగనాయకసాగర్‌ను టూరిస్ట్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రంగనాయకసాగర్‌ పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించారు. అలాగే రుకోడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.80 కోట్లు మంజూరు చేశారు.

Next Story
Share it