Telugu Gateway
Telangana

ద‌ళిత సాధికారిక‌త కోసం 40 వేల కోట్లు స‌మ‌కూరుస్తాం

ద‌ళిత సాధికారిక‌త కోసం 40 వేల కోట్లు స‌మ‌కూరుస్తాం
X

ద‌ళిత సాధికారిక‌త కోసం తెలంగాణ ప్ర‌భుత్వం 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు సమకూర్చ‌టానికి సిద్ధంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి కెసీఆర్ తెలిపారు. అయితే దీనికి స‌మిష్టి కార్యాచరణతో అందరం కలిసి చేపట్టాల‌న్నారు. కెసీఆర్ ఆదివారం నాడు ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో అఖిల పక్షం నేత‌ల‌తో ఈ అంశంపై స‌మావేశం నిర్వ‌హించారు. ప్రాజెక్టులు తదితర ప్రజావసరాల కోసం భూసేకరణలో భాగంగా సేకరించాల్సి వచ్చిన అసైన్డ్ భూములకు కూడా, పట్టాభూములకు చెల్లించిన ఖరీదునే ప్రభుత్వం చెల్లిస్తున్నద‌న్నారు. ఎటువంటి బ్యాంక్ గారెంటీ జంజాటం లేకుండానే ఈ పథకం ద్వారా దళితులకు సహకారం అందిస్తామ‌ని తెలిపారు. అద్దాల అంగడి మాయా లోకపు పోటీ ప్రపంచం లో, ఉపాధి అవకాశాలను అంది పుచ్చు కోవడానికి, దళిత బిడ్డలు తమ నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకోవాలి...అందుకు ప్రభుత్వ సహకారం అందిస్తుంది అని తెలిపారు. సామాజికంగా, ఆర్ధికంగా దళితులు అభివృద్ధి చెందాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయి. దళితుల అభ్యున్నతి కోసం దశలవారీగా కార్యాచరణ చేపడతాం. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలి.

అట్టడుగున ఉన్న వారి నుంచి సహాయం ప్రారంభించి.. వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా పర్యవేక్షించాలి. ఈ బడ్జెట్‌లో సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం. మరో రూ.500 కోట్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని తెలిపారు. దళితుల అభ్యున్నతి కోసం అఖిలపక్షం సూచనలు ఇవ్వాలి.దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని విధానం.రాజకీయాలకతీతంగా సమిష్టి కార్యాచరణ బాధ్యత తీసుకుందాం. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను గుర్తించి పరిష్కారాలు వెతకాలి. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని విధానం రైతుబంధు పథకం, ఆసర పెన్షన్ల మాదిరిగా.. నేరుగా దళితులకు ఆర్థికసాయం అందేలా సూచనలు ఇవ్వాల‌న్నారు.

Next Story
Share it