Telugu Gateway
Telangana

వేలాది మంది జర్నలిస్టుల జీవితాలతో కెసిఆర్ చెలగాటం

వేలాది మంది జర్నలిస్టుల జీవితాలతో కెసిఆర్ చెలగాటం
X

సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చాక మౌనం దాల్చిన సీఎం కెసిఆర్

ట్వీట్ చేసి వదిలేసిన మంత్రి కెటిఆర్

ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు అవసరం అయితే జర్నలిస్టులు సమాజాన్ని చైతన్యం చేయాలి అంటారు. అదే ఎవరు అయినా తనను ప్రశ్నిస్తే మాత్రం మీరు నాకు చెపుతారా అంటూ అందరి ముందు ఫైర్ అవుతారు. ఇది టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ తీరు. ఇంతకాలం సుప్రీంకోర్ట్ లో కేసు ఉండటం వల్లే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేక పోయామని చెపుతూ వచ్చారు. భూమికి కొదవే లేదు ..కేసు తేలటమే ఆలస్యం అందరికి న్యాయం చేస్తా అని పలు మార్లు మీడియా సమావేశాల సాక్షిగా చెప్పారు. హైదరాబాద్ లో పని చేస్తున్న 1100 మంది జర్నలిస్టులకు పైగా అప్పటి ప్రభుత్వం 2008 లో స్థలాలు కేటాయించింది. ఎన్నో కష్ట..నష్టాలతో జర్నలిస్టులు మార్కెట్ ధర ప్రకారం ప్రభుత్వానికి డబ్బు కూడా కట్టేశారు. కానీ ఈ వ్యవహారం హైకోర్టు...సుప్రీం కోర్ట్ లకు చేరటంతో దాదాపు 14 సంవత్సరాలు విషయం పెండింగ్ లో పడి పోయింది. ఎట్టకేలకు సుప్రీం కోర్ట్ ఈ ఏడాది ఆగస్ట్ 25 న ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పోలిస్తే జర్నలిస్టలకు జీతాలు చాలా తక్కువగా ఉంటాయని..వీళ్లకు ప్రభుత్వం 2008 లో కేటాయించిన స్థలాలు వాళ్లకు అప్పగించాలని. స్థలాల అభివృద్ధితో తో పాటు ఇల్లు కట్టుకోవటానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అప్పటి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. తీర్పు వచ్చి మూడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం మాత్రం అసలు తమకు ఏమి పట్టనట్లు వ్యవరిస్తోంది.

సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చిన గంటల్లోనే మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ తీర్పుతో తమ ప్రభుత్వం జరలిస్టులకు ఇచ్చిన హామీని నెరవేర్చటానికి మార్గం సుగమం అయింది అంటూ పేర్కొన్నారు. కానీ ఎన్నో సార్లు హామీ ఇచ్చిన సీఎం కెసిఆర్ కానీ..ఇటు మంత్రి కెటిఆర్ కానీ ఇప్పటివరకు అసలు దీనిపై నోరు తెరవటం లేదు. ఇదే విషయంలో కలుద్దామని చూస్తున్న జర్నలిస్ట్ నేతలకు సమయం కూడా ఇవ్వటం లేదు. సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చిన వెంటనే సీఎం కెసిఆర్ కి పాలాభిషేకాలు చేసి మురిసిపోయిన నాయకులూ కూడా ఈ విషయంపై మాట్లాకుండా మౌనం దాలుస్తున్నారు. ఈ పద్నాలుగు ఏళ్ల కాలంలో కొత్తతరం జర్నలిస్టులు కూడా చాలామంది వచ్చారు. అప్పటి సొసైటీ ఐదు ఏళ్ల సర్వీస్ ఆధారంగా మెంబర్ షిప్ ఇచ్చింది. అంటే అప్పటికి నాలుగున్నర ఏళ్ల సర్వీస్ ఉన్న వారికీ ఇప్పుడు దగ్గర దగ్గర 20 ఏళ్ల సర్వీస్ పూర్తి అవుతుంది. ఇలాంటి వారు కూడా వేలల్లో ఉన్నారు. పాత సొసైటీ సభ్యులు, ఎవరూ కూడా పాత వారితో పాటు ఎందులోనూ సభ్యత్వం లేని జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వటాన్ని ఆక్షేపించరు. జర్నలిస్టులుగా పనిచేస్తూ అర్హత ఉన్న అందరికి స్థలాలు రావాలన్నదే అందరి అభిప్రాయం. కానీ సమస్య అంత ప్రభుత్వం దగ్గరే ఉంది. సుప్రీమ్ కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున అర్హులు అందరికి స్థలాలు ఇవ్వాలని జర్నలిస్టులు అందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు.

Next Story
Share it