Telugu Gateway
Telangana

హై కోర్ట్ చెప్పినా కెసిఆర్ అంతేనా?!

హై కోర్ట్ చెప్పినా కెసిఆర్ అంతేనా?!
X

రిపబ్లిక్ డే అనేది బీజేపీ ధో...గవర్నర్, ముఖ్యమంత్రుల వ్యక్తిగత కార్యక్రమం కాదు. ఇది జాతీయ పండగ. ఇలాంటి జాతీయ పండగ విషయం లో ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర దుమారం రేపుతోంది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమం చేయాలని హై కోర్ట్ చెపితే కానీ ప్రభుత్వం ముందుకు కదలని పరిస్థితి. రాజ్ భవన్ లో ప్రభుత్వపరంగా ఏర్పాట్లు అయితే చేశారు కానీ...ఈ కార్యక్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం పాల్గొనలేదు. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ లు పాల్గొన్నారు. పోనీ రాజ్ భవన్ కు సీఎం పోలేదు. ప్రగతి భవన్ లోనే సీఎం కెసిఆర్ జెండా ఆవిష్కరణ చేశారు. అంటే ఎవరి ఆఫీస్ వాళ్ళు గణతంత్ర దినోత్సవం చేసుకోవటం ఏమిటో అర్ధం కావటం లేదు అని...ముఖ్యమంత్రి ఈ విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సమర్థనీయం కాదు అని ఐఏఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సీఎం కెసిఆర్ బీజేపీ తో ...గవర్నర్ తో రాజకీయంగా ఏ విషయంలో అయినా విభేదించవచ్చు అని..కానీ జాతీయ పండగ వంటి రిపబ్లిక్ డే విషయం సీఎం తీరు ఏ మాత్రం సరికాదని వాళ్ళు చెపుతున్నారు. ఖచ్ఛితంగా ఇది రాబోయే రోజుల్లో సీఎం కెసిఆర్ కు వ్యక్తిగతంగా, బిఆర్ఎస్ కు రాజకీయంగా నష్టం చేయటం ఖాయం అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఒక వైపు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి కీలక పాత్ర పోషించాలి అని చూస్తున్న కెసిఆర్ ఇలా చేయటం ఖచ్ఛితంగా జాతీయస్థాయిలోనూ చర్చనీయాంశంగా మారుతుంది అని చెపుతున్నారు. ఇప్పటికే దీనిపై జాతీయ మీడియా లో వార్తలు కూడా వచ్చాయి కూడా రిపబ్లిక్ డే వేడుకల్లో కెసిఆర్ పాల్గొనలేదు అని.ఇది అంత ఒక ఎత్తు అయితే గవర్నర్ తమిళ్ సై కూడా రిపబ్లిక్ డే సందర్భంగా చేసిన వ్యాఖలు కూడా దుమారం రేపుతున్నాయి. ఆమె ఫార్మ్ హౌస్ లు ..కొత్త భవనాలు అభివృద్ధికి సంకేతాలు కాదు అంటూ టార్గెట్ కెసిఆర్ గా విమర్శలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తున్న వాళ్ళు ఇద్దరు కీలకనేతలు వారి వారి లైన్లు దాటుతున్నట్లు కనిపిస్తోంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశం లో ప్రతి రాష్ట్రంలోనూ రిపబ్లిక్ డే కు గవర్నర్ లు జండా ఆవిష్కరణ చేయటం, సీఎం లు ఇందులో పాల్గొనటం ఎప్పటినుంచో ఉంది. సీఎం కెసిఆర్ గత రెండుళ్లుగా వ్యవహరిస్తున్న తీరు దుమారం రేపుతోంది.

Next Story
Share it