Telugu Gateway
Telangana

కెసిఆర్ కీ ఇస్తే ..వామపక్షాల వాయిస్ పెరుగుతోంది.

కెసిఆర్ కీ ఇస్తే ..వామపక్షాల వాయిస్ పెరుగుతోంది.
X

టిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్ చాలాకాలం వామపక్షాలను తోక పార్టీలు ఉంటూ విమర్శించారు. చివరకు మునుగోడు ఉప ఎన్నికలో అధికార టిఆర్ఎస్ బయటపడటానికి ఆ తోకలే ఉపయోగపడ్డయ్. స్వయంగా మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు ఫలితం తర్వాత వామపక్షాల దగ్గరికి వెళ్లి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపి వచ్చారు. వామపక్షాల వల్లే గెలుపు ఈజీ అయింది అని చెప్పారు. మరో వైపు ఏమో టిఆర్ఎస్ నేతలు అందరు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ను కలిసి అయన వల్లే మునుగోడులో గెలిచాం అంటూ ప్రకటనలు చేశారు. ఈ సంగతి పక్కన పెడితే గత కొన్ని ఏళ్లుగా పెద్దగా ఎక్కడ సౌండ్ లేకుండా ఉన్న వామపక్షాలు ఇప్పుడు వాయిస్ పెంచుతున్నాయి. సీఎం కెసిఆర్ కీ ఇస్తే ఇప్పుడు ఆ పార్టీల సౌండ్ పెరుగుతోంది. విచిత్రంగా ఆ సౌండ్ కేవలం ప్రధాని మోడీపైనే ఉండటం మాత్రమే చర్చనీయాంశంగా మారింది.. అంటే మోడీ విమర్శలకు అతీతుడు..మోడీని విమర్శించ కూడదు అని కాదు. కానీ గత ఎనిమిది ఏళ్లుగా తెలంగాణాలో అధికారంలో ఉన్న సీఎం కెసిఆర్ పై ఇదే వామపక్ష పార్టీలు చేసిన పోరాటాలు ఏమైనా ఉన్నాయా.. అంటే ఏదో తూ తూ మంత్రంగానే అని చెప్పుకోవచ్చు. అది కూడా ఏదో ప్రకటనలు ఇచ్చి ఉరుకోవటమే. వామపక్షాలు ముఖ్యంగా ప్రజాందోళనలు చేసి చాలా కాలమే అవుతోంది. సీఎం కెసిఆర్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి తో పాటు ఎన్నో హామీలను పట్టించుకోవటం లేదు. సంక్షేమ కార్యక్రమాలకు వేల కోట్లు ఖర్చుపెడుతున్న హాస్టల్స్ లో సరైన ఆహారంగా కూడా పెట్టలేక పోతున్నారు.

ఆహారం కోసం విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులు తెలంగాణాలో ఉన్నాయి. కానీ వీటిపై, రాష్ట్రంలోని సమస్యలపై మాత్రం వామపక్ష నాయకుల నోరు పెగలదు. కాదు కూడదు అని మాట్లాడితే కెసిఆర్ ఊరుకుంటారా. అందుకే ఇప్పుడు ఢిల్లీలో ఉండే ప్రధాని మోడీపై మాత్రం తెలంగాణాలో అకస్మాత్తుగా ఉద్యమాలు చేయటానికి సిద్ధం అయ్యారు.. అదే కెసిఆర్ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై మాత్రం నోరు తెరవరు. తెరిస్తే ఏమి జరుగుతుందో వాళ్లకు తెలుసు. కమ్యూనిస్టులతో ఒప్పందం సమయం లో సీఎం కెసిఆర్ మాట్లాడిన ప్రజాస్వామ్య శక్తుల ఏకీకరణ వంటి వ్యాఖ్యలు చుసిన వారు జోకులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలు టిఆర్ఎస్ కు ఎంతో కీలకం కాబట్టి ఈ ఏడాది కలం వామపక్ష బంధం ఇలా కెసిఆర్ చల్లని చూపులతో కొనసాగటం ఖాయంగానే కనిపిస్తోంది. కెసిఆర్ కరుణ కటాక్షాలతో రెండు కమ్యూనిస్టు పార్టీలు చెరో మూడు సీట్లు దక్కిన చాలు అన్న చందంగా ఉన్నాయనే వ్యాఖలు విన్పిస్తున్నాయి. ఇది ఒక ఎత్తు అయితే సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం పాలేరు లో ఎగిరేది ఎర్రజెండా అని వ్యాఖ్యానించటం టిఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు లు ఇద్దరికీ తమ్మినేని చేసిన ప్రకటన ఒకింత షాక్ అన్న చర్చ నడుస్తోంది. ఈ సీట్ ఫైట్స్ రాబోయే రోజుల్లే మరింత పెరిగే అవకాశం లేకపోలేదనే చర్చ నడుస్తోంది.

Next Story
Share it