Telugu Gateway
Telangana

పీవీని ఎంత గౌర‌వించుకున్నా త‌క్కువే

పీవీని ఎంత గౌర‌వించుకున్నా త‌క్కువే
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ దివంగ‌త ప్ర‌ధాని పీవీపై ప్రశంస‌ల వ‌ర్షం కురిపించారు. ఆయ‌న శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో కెసీఆర్ పాల్గొన్నారు. కాక‌తీయ యూనివ‌ర్శిటీలో పీవీ పీఠం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పీవీని ఎంత గౌర‌వించుకున్నా త‌క్కువే అని వ్యాఖ్యానించారు. సోమ‌వారం నాడు పీవీ ఘాట్‌లో మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహరావు శతజయంతి ముగింపు ఉత్సవాలు జ‌రిగాయి.ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ముందుగా సీఎం కేసీఆర్‌, గవర్నర​ తమిళిసై పీవీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం గవర్నర్ త‌మిళ్ సైతో కలిసి సీఎం కేసీఆర్‌ పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నెక్లెస్‌ రోడ్‌కు పీవీ మార్గ్‌గా నామకరణం చేసిన విషయం తెలిసిందే.పీవీ ఒక కీర్తి శిఖరం, దీప స్తంభమని అభివర్ణించారు. పీవీ నరసింహారావు చరిత్ర అందరికీ ఆదర్శం, ఆయన చాలా పటిష్టంగా భూ సంస్కరణలు చేశారని గుర్తుచేశారు. స‌మ‌యానుకూలంగా నిర్ణ‌యాలు తీసుకోవటంలో పీ వీ నిష్ణాతులు అన్నారు. పీ వీ రాజ‌కీయాల‌కు అతీతంగా గౌర‌వించుకోవాల్సిన వ్య‌క్తి అని అబ్దుల్ క‌లాం చెప్పార‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై వెల్ల‌డించారు. ఆయ‌న విగ్ర‌హ‌న్ని తాను ఆవిష్క‌రించ‌టం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. పీవీ ర‌చ‌న‌ల‌ను అందుబాటులోకి తేవ‌టం మంచి పరిణామం అన్నారు.

Next Story
Share it