ఢిల్లీ టూర్ లో సీఎం కెసీఆర్
BY Admin11 Dec 2020 11:11 AM GMT
X
Admin11 Dec 2020 11:11 AM GMT
మూడు రోజుల పర్యటన కోసం తెలంగాణ సీఎం కెసీఆర్ శుక్రవారం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కెసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. తన పర్యటనలో సీఎం కెసీఆర్ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ అపాయింట్ కోరినా ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అదే సమయంలో ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించి భూమి పూజపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కెసీఆర్ తో మంత్రి ప్రశ్రాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ తదితరులు ఉన్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్, హర్దీప్ సింగ్ పూరీ, నిర్మలా సీతారామన్ లతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
Next Story