Telugu Gateway
Telangana

తెలంగాణ ఉద్యోగులకు 30 శాతం ఫిట్ మెంట్

తెలంగాణ ఉద్యోగులకు 30 శాతం ఫిట్ మెంట్
X

ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంపు

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సోమవారం నాడు అసెంబ్లీ వేదికగా ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. పీఆర్సీ సిఫారసుల కంటే ఎంతో మెరుగ్గా ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అదే సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల పదవి విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల అనుభవాన్ని ఉపయోగించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 'తెలంగాణ సాధనలో ఉద్యోగులది కీలక పాత్ర. పీఆర్సీపై సీఎస్ కమిటీ నివేదిక అందించింది. ఉద్యోగ సంఘాల నేతలతో కూడా నేను చర్చించాను. ఉమ్మడి రాష్ట్రంలో కూడా టీఎన్జీవో అదే పేరుతో కొనసాగి..ఉద్యమాన్ని కొనసాగించింది. కరోనా వల్ల 11వ పీఆర్సీ కొంత ఆలశ్యం అయింది.

ఉద్యమ సమయంలో ఉద్యోగులు వేధింపులు తట్టుకుని నిలబడ్డారు. పీఆర్సీ ఫలితాలు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, హోం గార్డులు, వీఆర్ ఏలు, ఆశావర్కర్లు, అంగన్ వాడీలకు కూడా పీఆర్సీ వర్తింపచేయనున్నట్లు కెసీఆర్ ప్రకటించారు. పీఆర్సీ కమిషన్ సిఫారసు చేసినట్లు ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్య స్కీమ్ విధివిధానాల ఖరారుకు సంబంధించి ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ అధికారులతో ఓ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. టీచర్ల అంతర్ జిల్లా బదిలీలకు ఆమోదం తెలుపుతున్నట్లు సీఎం తెలిపారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు.

Next Story
Share it