Telugu Gateway
Telangana

క్లౌడ్ బ‌ర‌స్ట్ ఓ కుట్ర‌..వ‌ర‌ద‌ల‌పై కెసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

క్లౌడ్ బ‌ర‌స్ట్ ఓ కుట్ర‌..వ‌ర‌ద‌ల‌పై కెసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

తెలంగాణ సీఎం కెసీఆర్ వ‌ర‌ద‌ల‌కు సంబంధించిన అంశంపై భ‌ద్రాచలంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మారిన ప‌రిస్థితుల్లో మ‌నం చ‌రిత్ర‌లో ఊహించ‌ని వ‌ర‌ద క‌డెం ప్రాజెక్టులో చూశాం. ఏ ఒక్క రోజు కూడా రెండున్న‌ర ల‌క్షలు దాట‌లేదు అది. దాని హ‌య్య‌స్ట్ డిశ్చార్జ్ సుమారు మూడు లక్షలు ఉంట‌ది. ఈ సారి ఐదు ల‌క్షలు దాటింది. నిజం చెప్పాలంటే అది మానవ ప్ర‌య‌త్నం కాదు..భ‌గ‌వంతుడి ద‌య వ‌ల్లే ప్రాజెక్టు బ‌తికింది. ఆ పోటోలు..వీడియోలు చూస్తుంటే మొత్తం నీళ్ళు ఉంటే ఓ గీత లాగా డ్యామ్ క‌న్పిస్తోంది. అట్లాంటి ప‌రిస్థితుల్లో మ‌నం ఏదో త‌ప్పించుకోగ‌లిగాం కానీ..క్లౌడ్ బ‌ర‌స్ట్ అనే కొత్త ప‌ద్ద‌తి ఏదో వ‌చ్చింది. ఇదేదో కొన్ని కుట్ర‌లు ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఎంత వ‌ర‌కు క‌రెక్టో తెల్వ‌దు. ఇత‌ర దేశాల వాళ్లు కావాల్సుకుని మ‌న దేశంలో అక్క‌డ‌క్క‌డ క్లౌడ్ బ‌ర‌స్ట్ లు చేస్తున్నారు.

గ‌తంలో ఓ సారి కాశ్మీర్ ద‌గ్గ‌ర ల‌ద్దాఖ్ లోని లేహ్ లో చేశారు..ఆ త‌ర్వాత ఉత్త‌రాఖండ్ లో చేశారు. ఈ మ‌ధ్య గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంలో కూడా చేస్తున్న‌ట్లు మ‌నకు స్ప‌ష్ట‌త లేకుండా వ‌చ్చిన స‌మాచారం. ఇప్ప‌టికీ వాతావ‌ర‌ణంలో సంబంధించే మార్పులు వ‌ల్ల ఇలాంటి ఉత్పాతాలు వ‌స్తాయి కాబ‌ట్టి..ఈ సంద‌ర్భంలో మ‌నం ప్ర‌జ‌లుకాపాడుకోవాల్సి ఉంట‌ది అంటూ వ్యాఖ్యానించారు. భ‌ద్రాచ‌లం దేవాల‌యాన్ని కూడా ఎలా చేయాలో తానే వ‌చ్చేవారం వ‌స్తాన‌ని..శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిద్దామ‌ని సూచించారు. ఎత్తైన ప్రాంతాల్లో వ‌ర‌ద ముంపు స‌మ‌స్య ప‌రిష్కారం కోసం వెయ్యి కోట్లతో కాలనీలు నిర్మాణం చేపట్ట‌నున్న‌ట్లు తెలిపారు. వరద బాధిత కుటుంబాలకు 10000 వేల రూపాయ‌ల ఆర్ధిక సహాయం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. వరద వల్ల ప్రాణ నష్టం కలగలేద‌ని..అధికారులు అంతా బాగా ప నిచేశార‌ని కొనియాడారు.

Next Story
Share it