టీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు బక్కని నర్సింహులకు
BY Admin19 July 2021 11:36 AM IST

X
Admin19 July 2021 11:36 AM IST
తెలంగాణ టీడీపీకి నూతన అధ్యక్షుడు వచ్చారు. ఎల్ రమణ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరటంతో టీ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో నూతన నియామకం చేపట్టారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. బక్కని నర్సింహులు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు.
టీ టీడీపీ అధ్యక్ష పదవికి రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చినా బక్కని నర్సింహుల నియామకంతో చర్చకు తెరపడినట్లు అయింది. ఎల్ రమణ ఉన్న సమయంలో కూడా పేరుకు తెలంగాణలో పార్టీ ఉంది కానీ..అసలు ఏ మాత్రం కార్యకలాపాలు లేకుండా స్తబ్దుగా ఉంది.
Next Story



