Telugu Gateway
Telangana

చైతన్య కాలేజీ సిబ్బంది టార్చర్..విద్యార్ధి ఆత్మహత్య

చైతన్య కాలేజీ సిబ్బంది టార్చర్..విద్యార్ధి ఆత్మహత్య
X

చైతన్య కాలేజీ విద్యార్థులపై పెట్టే వత్తిడి విషయం లో విమర్శలు చాలానే ఉన్నాయి. ఇవి ఎప్పటినుంచో ఉన్నా అటు ప్రభుత్వం ఈ విషయం లో ఎప్పుడు దృష్టి పెట్టదు..కాలేజీ యాజమాన్యం తన తీరుమార్చుకోదు. ఎన్ని మార్కులు వచ్చినా తమకు ఇబ్బంది లేదు అని తల్లిదండ్రులు కాలేజీ లెక్చరర్లకు చెప్పినా కూడా వేధించటం అన్నది మరీ దారుణం. వీళ్ళ ఒత్తిడి, అవమానాలు తట్టుకోలేక హైదరాబాద్ లోని నార్సింగ్ లో ఇంటర్ విద్యార్థి సాత్విక్ మంగళవారం రాత్రి పదిన్నర గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం పెద్ద దుమారం రేపింది. కాలేజీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాలు అక్కడ ధర్నాకు దిగాయి. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీస్ లు సెక్షన్ 305 కింద కేసు నమోదు చేసారు. . సాత్విక్ మృతికి బాధ్యులైన ఆచార్య కృష్ణారెడ్డి, నరేష్ పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చామనిపోలీస్ లు వెల్లడించారు. కాలేజీలో ఒత్తిడి, వేధింపుల వల్లనే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని తెలిపారు.

సాత్విక్ మృతిపై విచారణ చేస్తున్నామని.. బాధ్యుల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నార్సింగి ఇన్‌స్పెక్టర్ మీడియా కు చెప్పారు.క్యాంపస్‌లో విద్యార్థుల మీద భౌతిక దాడి జరిగినట్టు వీడియోలు హల్చల్ అవుతున్నాయన్నారు. ఆ వీడియోల పైన సైతం విచారణ చేస్తున్నామని.. అందులో కొన్ని పాత వీడియోలు కూడా ఉన్నాయన్నారు.ఈ కేసులో ఇప్పటికే ఆచార్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు. సాత్విక్ కుటుంబానికి చట్టపరమైన న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ ఘటన తో తల్లితందులు కూడా తీవ్ర ఒత్తిడిలోకి వెళుతున్నారు. మరి కొద్ది రోజుల్లోనే వార్షిక పరీక్షలు జరగనున్న తరుణంలో చోటు చేసుకున్న ఘటన విద్యార్థులపై ప్రభావం చూపించే అవకాశం ఉండనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Next Story
Share it