Telugu Gateway
Telangana

కరోనా ను అంచనా వేయటంలో కేంద్రం విఫలం

కరోనా ను అంచనా వేయటంలో కేంద్రం విఫలం
X

లాక్ డౌన్ ఆలోచన లేదు

ఇప్పుడే 18 ఏళ్ల సంవత్సరాల వారికి వ్యాక్సిన్ సాధ్యం కాదు

పాక్, బంగ్లాదేశ్ లు కూడా భారత్ కు సాయం చేస్తామనే స్థితికి తెచ్చారు

ఈటెల సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ ను అంచనా వేసి రాష్ట్రాలను అప్రమత్తం చేయటంలో కేంద్రం విఫలమైందన్నారు. కరోనా నియంత్రణకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం చేసింది ఏమీలేదన్నారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఎన్నికలు , కుంభమేళాలు నిర్వహించారని విమర్శించారు. ఈటెల రాజేందర్ గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈటెల మాటలు ఆయన వ్యాఖ్యల్లోనే...'ముందుగానే సెకండ్ వేవ్ విషయంలో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వ్యాక్సిన్ ల కొరత , ఇంజక్షన్ ల సరఫరా లో కేంద్రనికి ముందుచూపు లేదు. కరోనా విషయంలో రాజకీయాలను పట్టించుకోకుండా కేంద్రం చెప్పినట్లు విన్నాం.రాష్ట్రాలకు అధికారం- ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా అన్ని కేంద్రం అధీనంలోనే పెట్టుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆక్సిజన్ లేకుండా మరనిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలకే కాకుండా- పక్కన ఉన్న నాలుగు రాష్ట్రాలకు వైద్యం అందిస్తున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వం పై తప్పులు మాటలు- తప్పుడు విమర్శలు చేయొద్దు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు ప్రతి మూడు రోజులకు ఒకసారి రక్తపరిక్షలు చేయించుకోవాలి. రిమ్స్- నల్గొండ- అసిఫాబాద్- జగిత్యాల్-జనగామ- జోగులంబ- కొత్తగూడెం- మెదక్- ములుగు- సిరిసిల్ల- సంగారెడ్డి- వికారాబాద్- మహబూడ్ నగర్. మొత్తం 19 జిల్లాలో అందుబాటులోకి తెచ్చాం. బంగ్లాదేశ్-పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా ఇండియా కు సహాయం చేస్తాం అన్న పరిస్థితికి దేశం వచ్చింది. ఇప్పుడు టెస్టులు చేసే సమయం కాదు. లాక్ డౌన్ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. వ్యాక్సిన్ గురించి భారత్ బయో టెక్- రెడ్డి లాబ్స్ తో ప్రత్యేక భేటీ సీఎస్ ఆధ్వర్యంలో జరిగింది.' అని వెల్లడించారు.

Next Story
Share it