మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు
BY Admin21 July 2021 11:34 AM GMT
X
Admin21 July 2021 11:34 AM GMT
తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ పెద్ద సంచలనం.. సర్కారు దీనిపై స్పందించిన తీరు కూడా ఆశ్చర్యకరమే. ఇవన్నీ ఒకెత్తు అయితే ఆయన రాజీనామా చేసిన రెండు రోజులకే ఆయనపై కేసు నమోదు కావటం మరో విచిత్రం. ఎప్పుడో దాఖలైన కేసుపై తాజాగా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ మున్సిఫ్ జడ్డి ఆదేశాలు జారీ చేశారు. హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆర్‌ఎస్ ప్రవీణ్‌పై కేసు నమోదుకు కరీంనగర్ మూడో పట్టణ పోలీసులకు మున్సిఫ్ కోర్టు జడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో ప్రవీణ్ కుమార్ ఏమి చేయబోతున్నారనే అంశంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.
Next Story