బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ పై కేసు
BY Admin7 Jun 2022 4:53 AM

X
Admin7 Jun 2022 4:53 AM
సామూహిక అత్యాచారానికి గురైన మైనర్ బాలికకు సంబంధించిన వీడియోలు..ఫోటోలు బహిర్గతం చేశారనే ఆరోపణలతో బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన ఓ మీడియా సమావేశంలో వీడియోలు..ఫోటోలు విడుదల చేసిన సమయంలో తాను సుప్రీం మార్గదర్శకాల ప్రకారమే ఎవరి మొహలు కన్పించకుండా జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు. అయినా ఇప్పుడు ఆయనపై కేసు నమోదు అయింది. తనకు కేసులు కొత్తకాదని..పోలీసులు తనపై కేసు పెడితే ఎదుర్కొంటానని సోమవారం నాడే ప్రకటించారు.
Next Story