తెలంగాణ పారిశ్రామిక విధానాలకు విదేశాల్లోనూ ఆదరణ
టీఆర్ఎస్ ఎన్ ఆర్ ఐ కెనడా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.టీఆర్ఎస్ కెనడా విభాగం అధ్యక్షుడు కృష్ణ కోమండ్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంగా సాగింది. ఈ సందర్భంగా పలువురు ఎన్ ఆర్ ఐలు టీఆర్ఎస్ లో చేరారు. కెనడా విభాగం అధ్యక్షుడు కృష్ణ వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేసి 14 ఎండ్లు ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడితే 60 ఎండ్ల స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందన్నారు. దేశంలోని రాజకీయ పార్టీలన్నింటిని ఒప్పించి గాంధేయ మార్గంలో పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. అమరుల త్యాగాలు వెలకట్టిలేనివని 1200 మంది విద్యార్థులను బలి తీసుకున్న చరిత్ర నాటి పాలకులదని స్పష్టం చేశారు.
ఎన్ని అవరోధాలు సృష్టించిన అధరక బెదరక పోరాడిన స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడిందని ఈ సందర్భంగా నాటి ఉద్యమ రోజులను గుర్తు చేసుకున్నారు ఎన్ఆర్ఐ లు, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో వివిధ అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను రాష్ట్రంలో నెలకొల్పేల చేశారని దీంతో వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వచ్చాయని చెప్పారు. యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు దక్కాయని అన్నారు. మేము హైదరాబాద్ అంటే చాలు మీ స్టేట్ బిజినెస్ పాలసీ అధ్భుతంగా ఉందని ఇక్కడి వారు సైతం కొనియాడుతున్నారని తెలిపారు.