Telugu Gateway
Telangana

మొన్న బిఆర్ఎస్ 3.0 ..ఇప్పుడు పింక్ బుక్

మొన్న బిఆర్ఎస్ 3.0 ..ఇప్పుడు పింక్ బుక్
X

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ కుమార్తె , ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య వెరైటీ వైరైటీ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. రాజకీయ నాయకులు గత కొన్ని సంవత్సరాలుగా పంచ్ డైలాగులు..సినిమాటిక్ డైలాగులు చెపుతూ అటెన్షన్ డ్రా చేయటానికి ట్రై చేస్తున్నారు. ఈ విషయంలో బిఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్ తో పాటు హరీష్ రావు లు ముందు వరసలో ఉంటారు అనే చెప్పాలి. అయితే వీళ్ళతో పోటీ పడే క్రమంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నీ కాపీ డైలాగులు వాడుతున్నారు అనే చర్చ సాగుతోంది. ఇటీవలే వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ లో జగనన్న 2.0 వస్తుంది...అప్పుడు అందరి సంగతి చూస్తా అంటూ చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత వెంటనే ఎమ్మెల్సీ కవిత కూడా తెలంగాణ లో బిఆర్ఎస్ 3.0 , కెసిఆర్ 3.0 గ్యారంటీ అని చెప్పారు. అప్పుడు ఉద్యమకారులకు తోలి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు కవిత. ఇది అయిపోయిందో లేదో...లేటెస్టుగా ఆమె పింక్ బుక్ ను తెర మీదకు తీసుకు వచ్చారు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ఆంధ్ర ప్రదేశ్ లో రెడ్ బుక్ అనే విషయం పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఏపీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎప్పటి నుంచో ఈ రెడ్ బుక్ ను తెర మీదకు తెచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధించిన వాళ్ళ పేర్లు రెడ్ బుక్ లో రాస్తామని...అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారం లో హోరెత్తించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ కాస్తా ఖాతా బుక్ గా మారింది అనే విమర్శలు లేకపోలేదు.

లోకేష్ రెడ్ బుక్ అంటే...ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్ కూడా ఏదో గుడ్ బుక్ అంటూ కూడా ఏదో చెప్పుకొచ్చారు. ఇప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా పింక్ బుక్ అంటూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని వేధింపులకు గురి చేసినా అన్ని వివరాలు అందులో అంటే పింక్ బుక్ లో రాసుకుని తర్వాత అంతకంతా చెల్లిస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే కవిత అటు కెసిఆర్ 3.0 తో పాటు ఇప్పుడు పింక్ బుక్ విషయంలో కూడా కాపీ మోడల్ ను ఫాలో అవుతున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Next Story
Share it