బిఆర్ఎస్ మ్యానిఫెస్టో పై కనిపించని సానుకూలత!
ఇప్పుడు మ్యానిఫెస్టో విషయంలోనే అదే పరిస్థితి. కాంగ్రెస్ కీలక హామీలను కాపీ కొట్టడం ఒకెత్తు అయితే రైతుల కోసం ఎంతైనా చేస్తాను అని పలు మార్లు ప్రకటించిన కెసిఆర్ ఈ సారి మాత్రం లక్ష రూపాయల రైతు రుణ మాఫీ పథకాన్ని పూర్తిగా ఎత్తేసారు. ప్రచారం జరిగిన ఉచిత ఎరువుల ఊసెత్తలేదు. గతంలో ఒకసారి రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కెసిఆర్ ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చారు. యువతకు అత్యంత కీలకమైన ఉద్యోగాలు..ఉపాధి హామీ వంటి వాటి విషయంలో అసలు బిఆర్ ఎస్ మ్యానిఫెస్టో ఏ మాత్రం ఫోకస్ పెట్టలేదు. అయితే ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే గతంలో ఇలాగే ఎన్నో మాటలు చెప్పిన కెసిఆర్ వాటిలో అమలు చేసింది కొన్నే కావటంతో కొత్తగా ప్రకటించిన మ్యానిఫెస్టో ను కూడా ప్రజలు ఎంత మేరకు నమ్ముతారు అనే దానిపై పలు అనుమానాలు ఉన్నాయి. ఒకే సారి 115 మంది అభ్యర్థులను ప్రకటించినా..మ్యానిఫెస్టో ప్రకటించిన తర్వాత కూడా బిఆర్ఎస్ కు ఎక్కడ పెద్దగా సానుకూల సంకేతాలు వస్తున్నా దాఖలాలు లేవు అని..ఇవన్నీ చూస్తే ఏదో లెక్క తేడా కొడుతున్నట్లే ఉంది అనే అనుమానాలు ఆ పార్టీ నేతల్లో కూడా వ్యక్తం అవుతున్నాయి.