Telugu Gateway
Telangana

బిఆర్ఎస్ కు వందల కోట్ల స్థలాలు..అయినా జర్నలిస్ట్ ల స్థలాలపై కన్ను!

బిఆర్ఎస్ కు వందల కోట్ల స్థలాలు..అయినా జర్నలిస్ట్ ల స్థలాలపై కన్ను!
X

హైదరాబాద్ లోనే స్టేట్ ఆఫీస్ కు ఎకరం...మళ్ళీ సిటీ ఆఫీస్ కూ మరో ఎకరం!

అధికార బిఆర్ఎస్ కు బంజారా హిల్స్ లో వందల కోట్ల రూపాయల విలువ చేసే స్థలం ఉంది. అది ఎకరం పైనే. అందులో ఏడాదికి 30 రోజులు కార్యక్రమాలు జరిగితే గొప్ప. ఈ పార్టీ ఆఫీస్ ను వ్యాపార అవసరాల కోసం వాడుకుంటున్నారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ ఇదే బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ హైదరాబాద్ లోనే సిటీ ఆఫీస్ పేరుతో అదే బంజారా హిల్స్ మరో ఎకరం స్థలం కేటాయింపు చేసుకున్నారు. అదేమంటే గజం వంద రూపాయల లెక్కన గుర్తింపు ఉన్న పార్టీ లకు స్థలం ఇవ్వటానికి పాలసీ తెచ్చామని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో అధికార పార్టీ స్థలాలు తీసుకుంది. పోనీ ఇదే తరహాలో ఇతర పార్టీలకు ఇచ్చారా అంటే అదేమీ ఉండదు. ప్రభుత్వం వాళ్లదే..పాలసీ వాళ్లదే...వందల కోట్ల స్థలాలు వాళ్ళవే. అదే లెక్క. పోనీ జిల్లాల్లో ఇచ్చారంటే కొంత హేతుబద్దత ఉంది అనుకోవచ్చు. కానీ హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం రాష్ట్ర పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతం లోనే ఏకంగా వంద కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే స్థలాన్ని సిటీ ఆఫీస్ కు కేటాయించటం అంటే ఇందులో ఈ మాత్రం హేతుబద్ధ లేదనే చెప్పొచ్చు. రాష్ట్ర కార్యాలయంలోనే ఏడాదికి 30 రోజులు కూడా కార్యక్రమాలు ఉండవు. అలాంటిది సిటీ ఆఫీసులో పరిస్థితీ ఊహించుకోవచ్చు. అంటే కేవలం వందల కోట్ల స్థలంపై కన్నేయటమే అనే విమర్శలు ఉన్నాయి. ఇది ప్రజల ఆస్తుల లూటీ తప్ప మరొకటి కాదు అని విమర్శించిన దాసోజు శ్రావణ్ ఆ తర్వాత వెళ్లి అదే పార్టీ లో చేరారు.

అధికార పార్టీ మాత్రం పాలసీ పేరు చెప్పి తెలంగాణ రాష్ట్రం అంతటా కోట్ల రూపాయల విలువైన స్థలాలు తీసుకోవచ్చు. కానీ ఇదే ప్రభుత్వం జర్నలిస్టులకు పాలసీ ప్రకారం, మార్కెట్ రేట్ ప్రకారం ఇచ్చిన భూమి విషయంలో మాత్రం వేదింపులకు గురి చేస్తోంది. 14 ఏళ్ల తర్వాత సుప్రీమ్ కోర్ట్ కేసు క్లియర్ చేసినా మా ఇష్టం అయితే ఇస్తాం లేకపోతే లేదు...అప్పటి వరకు ఎవరూ మాట్లాడానికి లేదు అన్న ఛందంలో వ్యవరిస్తోంది. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అటు సీఎం కెసిఆర్, ఇటు మంత్రి కెటిఆర్ లు సమయం ఇవ్వకుండా 1100 ల మంది జర్నలిస్టుల కుటుంబాలతో ఆడుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. వీళ్ళే కాదు ఇంకా అర్హులు, ఇళ్ల స్థలాలు పొందాల్సిన జర్నలిస్టులు వేల సంఖ్యలో ఉన్నారు. అధికార బిఆర్ఎస్ మాత్రం రాష్ట్రం అంతటా పార్టీ ఆఫీస్ ల పేరుతో స్థలాలు తీసుకుని వందల కోట్ల విలువైన భూములు సంపాదించు కుంటోంది. అరకొర జీతాలతో ఉద్యాగాలు చేసే జర్నలిస్టులకు మాత్రం పాలసీ ప్రకారం, మార్కెట్ ప్రకారం స్థలం ఇవ్వకుండా, ఇచ్చిన వాటినికూడా అప్పగించకుండా వేధింపులకు గురిచేస్తోంది. ఒక వైపు తన రాజకీయ అవసరాల కోసం మాత్రం రాష్ట్రంలోని పలు జిల్లాలో స్థలాలను గజాల లెక్క అమ్ముకుంటోంది.

టిఆర్ఎస్ కు వంద కోట్ల స్థలం కేటాయింపు పై కేసు

Next Story
Share it