Telugu Gateway
Telangana

అసలు ఎవరైనా ఫార్మ్ హౌస్ పాలన కోరుకుంటారా!

అసలు ఎవరైనా ఫార్మ్ హౌస్ పాలన కోరుకుంటారా!
X

ఆన్ లైన్ పోల్ తో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టుకుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఆ పార్టీ కి జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. తర్వాత ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా అవి జనంలోకి పెద్దగా పోవు. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఆన్ లైన్ సర్వే లో పాల్గొనేది కచ్చితంగా చదువుకున్న వల్లే అన్న విషయం తెలిసిందే. అది కూడా ట్విట్టర్ పోల్ లో. అందులో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అని ప్రశ్న వేసి ఫార్మ్ హౌస్ పాలనా లేక ప్రజల వద్దకు పాలనా అని అడిగితే అందులో ఏకంగా ఏకంగా 67 శాతం వరకు ఫార్మ్ హౌస్ పాలనకు ఓటు వేస్తే ..33 శాతం మాత్రం ప్రజల వద్దకు పాలన కు ఓటు వేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే ఏ మాత్రం చదువుకున్న వ్యక్తి అయినా కూడా ముఖ్యమంత్రి ఫార్మ్ హౌస్ నుంచి పాలన సాగించాలి అని కోరుకోడు.

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు లేవు అని ఎవరూ చెప్పరు. రుణ మాఫీ తో పాటు రైతు భరోసా వంటి వాటి విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఫీట్లు ఆ పార్టీ కి రావాల్సిన లాభం కూడా లేకుండా చేస్తున్నాయి అనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే ఉంది. అయితే ఏడాదికి పైగా ప్రతిపక్ష పాత్ర వదిలేసినా కెసిఆర్ ఫార్మ్ హౌస్ కే పరిమితం అయి...ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆన్ లైన్ పోలే అసలైన పోల్ అన్న చందంగా వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. ఏమీలేనప్పుడే కెసిఆర్ మాటలతో మాయ చేస్తారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ ఒక పోల్ పెట్టి ఆయనకు ఆయుధం ఇచ్చింది. అందుకే కొన్ని రోజులు పోతే కాంగ్రెస్ వాళ్ళు దొరికితే తెలంగాణాలో కొట్టేలా ఉన్నారు అంటూ కెసిఆర్ వ్యాఖ్యలు చేశారు. తాను అన్ని విషయాలను గంభీరంగా.. మౌనంగా చూస్తున్నా. కొడితే ఒట్టిగా కొట్టటం నాకు అలవాటు లేదుగా . గట్టిగా కొట్టడం నా అలవాటు. అన్ని ప్రాజెక్టులు అక్కడివి అక్కడే ఆగిపోయియి. ఫిబ్రవరి నెలాఖరులోగా పెద్ద బహిరంగ సభ పెట్టాలి.

తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్ళకి చూపించి మెడలు వంచుతాం. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరు. నేను చెప్పిన ప్రజలు వినలేదు...అత్యాశకు పోయి కాంగ్రెస్ కి ఓటేశారు. రైతు బంధుకి రాం రాం, దళితబంధుకి జై భీం చెబుతారని ఆనాడే చెప్పాను. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కి ఓటేశారు. రాబోయే రోజుల్లో విజయం మనదే. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలి. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి. భూముల ధరలు అమాంతం పడిపోయాయి. చారిత్రక సందర్భంలో తెలంగాణ జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిలలాడింది, సర్వనాశనం అయింది. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే. ప్రాణం పోయిన సరే తెగించి కొట్లాడేది మనమే, తెలంగాణకి రక్షణ మనమే. ఏడాది నుంచి సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. అన్ని మబ్బులు తొలిగిపోయి ఇప్పుడు నిజాలు బయటికి వస్తున్నాయి. మంచి ఏదో చెడు ఏదో ప్రజలకు తెలుస్తుంది. మాట్లాడితే ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అని బద్నామ్ చేస్తున్నారు. ఫామ్ హౌస్ లో పంటలు తప్ప ఏముంటాయి అంటూ కెసిఆర్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it