Telugu Gateway
Telangana

కెసిఆర్ ఓన్లీ క్యాష్ రిచ్ స్టేట్స్ కే వెళతారా?!

కెసిఆర్ ఓన్లీ క్యాష్ రిచ్ స్టేట్స్ కే వెళతారా?!
X

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు తెలంగాణ మోడల్ ఒక్కటే దేశానికీ శరణ్యం అని చెపుతున్నారు. దేశంలో అందరూ కూడా ఇప్పుడు ఇటు వైపు చూస్తున్నారు అని పదే పదే ప్రకటిస్తున్నారు. అదే నిజం అయితే తెలంగాణ మోడల్ దేశంలో ఎక్కడైనా ఒకేలా పనిచేయాలి. పొరుగున ఉన్న రాష్ట్రాల్లో ఎలా పని చేస్తుందో...దేశంలో ఎలా పనిచేస్తుందో ఎన్నికలు వస్తే కానీ తెలియదు. ఇక్కడ కీలక మైన విషయం ఏమిటి అంటే ఇతర అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రజలకు బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వంద శాతం తెలుసు. సీఎం కెసిఆర్ పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ను అసలు ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అయన మహారాష్ట్రపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. దీనిపై ఆక్షేపించాల్సిన అవసరం ఏమి ఉండదు. అయితే ఇదే కెసిఆర్ తాను వంద శాతం తెలిసిన...తెలంగాణల్లో అమలు అవుతుకున్న పథకాలు అన్నీ తెలిసిన ఆంధ్ర ప్రదేశ్ వైపు ఎందుకు కన్నెత్తి చూడటంలేదు అన్నది చర్చనీయాంశగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఆదివారం నాడు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తోట చంద్ర శేఖర్ బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను ప్రారంభించారు. దీనికి పార్టీ అధినేత కెసిఆర్ హాజరు కాలేదు కదా...కనీసం ఒక మంత్రిని కానీ...ఇతర కీలక నేతలను కానీ ఈ కార్యక్రమానికి పంపలేదు.

ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మహారాష్ట్రలోని నాగపూర్ తో పాటు పలు ప్రాంతాల్లో సొంత భూమి కొని బిఆర్ఎస్ ఆఫీస్ లు పెడతామని కెసిఆర్ చెపుతున్నారు. ఇప్పటికే ఆయన పలు మార్లు మహారాష్ట్రలో పర్యటించారు...పబ్లిక్ మీటింగ్ లు కూడా పెట్టారు. పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. వాస్తవానికి వైజాగ్ లో మీటింగ్ ఉంది అని చంద్ర శేఖర్ ప్రకటించిన అది జరగలేదు. ఇది చూసిన బిఆర్ఎస్ నాయకుడు ఒకరు తమ అధినేత క్యాష్ రిచ్ స్టేట్స్ పైనే ఫోకస్ పెట్టారని..ఆంధ్ర ప్రదేశ్ లో ఏమి ఉంది అని అటు చూడాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఏ మాత్రం సత్తా చాట గలిగినా దేశ ఆర్థిక రాజధాని ముంబై లాంటి నగరం ఉంది అక్కడ అని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ పెట్టిన వెంటనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన కెసిఆర్ అటు వైపు చూడలేదు. తమ అధినేత ఏమి చేసిన ఒక ఎజెండా ఉంటది అని...అది అంతా అయిపోయిన తరవాత కానీ చాలా మందికి విషయం అర్ధం కాదు అని అయన వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ నేతలు చెపుతున్నట్లు రాబోయే రోజుల్లో కెసిఆర్ ఏ మేరకు ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో దూకుడు చూపిస్తారో చూడాలి.

Next Story
Share it