టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై బిజెపి దాడి
BY Admin31 Jan 2021 12:18 PM

X
Admin31 Jan 2021 12:18 PM
అయోధ్యలో రామమందిరం పేరుతో బిజెపి నేతలు ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి నేతలు ఆయన ఇంటిపై దాడికి దిగారు. దీంతో హన్మకొండలో ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటిపై బిజెపి నేతలు గుడ్లు, టమాలతో దాడి చేశారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 29 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయా? అంటూ ఆయన ప్రశ్నించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నెలకొల్పిన సర్కారు..రాముడి గుడి కట్టలేదా? అని ప్రశ్నించారు. రాముడి పేరు చెప్పి బిజెపి రాజకీయం చేస్తోందని..తాము కూడా హిందువులమే అంటూ వ్యాఖ్యానించారు. ధర్మారెడ్డి వ్యాఖ్యలపై బిజెపి నిరసన వ్యక్తం చేసింది.
Next Story