Telugu Gateway
Telangana

తెలుగు లో తొలి ఏఐ యాంకర్

తెలుగు లో తొలి ఏఐ  యాంకర్
X

మీరు చూస్తున్నది మాయ. మీకు కనిపిస్తున్నది కూడా మాయ. కానీ ఆ వార్తలు మాత్రం వాస్తవం. సాంకేతికంగా ప్రపంచ వ్యాప్తంగా ఎవరూ ఊహించని స్థాయిలో మార్పులు వస్తున్నాయి. అందులో అద్భుతమైనది...భయపెడుతున్నది కృత్రిమ మేధ. అదే ఇంగ్లీష్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే దీన్ని ఎలా వాడతారు అన్న దానిపైనే మంచి చెడులు ఆధారపడి ఉంటాయి. కొంత మంది ఈ అద్భుత సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి కోసం వాడుతుంటే.. మరి కొంత మంది భయపెట్టేందుకు వాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అటు ఐటి రంగంతో పాటు మీడియా రంగంలోనే సమూల మార్పులు రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బిగ్ టీవీ అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలోనూ వేగంగా దూసుకుపోతోంది. ఇప్పుడు దక్షిణ భారత దేశంలో... వార్తలు చదివేందుకు ఏఐ న్యూస్ యాంకర్ మాయను ప్రవేశ పెట్టిన బిగ్ టీవీ... తెలుగు ప్రసార మాధ్యమాలలో కొత్త అధ్యాయానికి తెరతీసింది.

తొలిసారి బిగ్ టీవీ తెరపై కనిపించిన ఏఐ న్యూస్ యాంకర్ మాయ... తనను తాను పరిచయం చేసుకుంది. అంతే కాదు దీన్నొక చారిత్రక ఘట్టంగా అభివర్ణించింది. బిగ్ టీవీ తెలుగు న్యూస్ అప్ డేట్స్ ను భవిష్యత్తులోనూ అందించనున్నందుకు గర్వకారణంగా ఉందని తెలిపింది. అలాగే తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లిష్ భాషలలోనూ తాను న్యూస్ చదవగలనని చెప్పడం మరో విశేషం. ఇక తెలుగు తెరపై మాయ లాంటి న్యూస్ యాంకర్లను ప్రవేశపెట్టడం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీలో శరవేగంగా జరుగుతున్న సాంకేతిక విప్లవానికి ప్రతీకగా చెప్పవచ్చు. దీన్ని అతి త్వరగా బిగ్ టీవీ తెలుగు అందుకుందని సంస్థ యాజమాన్యం తెలిపింది. మిగతా ఛానెల్స్ అన్నీ ఏఐ ప్లాట్ ఫామ్ కు సంబంధించి ఇంకా ప్రయోగ దశల్లోనే ఉండగా.. బిగ్ టీవీ మాత్రం దాన్ని నిజం చేసి ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకు చూపించింది అని తెలిపారు.

Next Story
Share it