Telugu Gateway
Telangana

సోమేష్ కుమార్ హై కోర్ట్ షాక్..సంబరాల్లో ఐఏఎస్ లు

సోమేష్ కుమార్ హై కోర్ట్ షాక్..సంబరాల్లో ఐఏఎస్ లు
X

తెలంగాణ ఐఏఎస్ లు చాలామంది రేస్ గుర్రం సినిమా లో శృతి హాసన్ తరహాలో ఫుల్ ఖుషి ఖుషి గా ఉన్నారు. అయితే ఆ ఖుషి బయటకు కనిపించదు. వైర్ లో కరెంటు ఎలా బయటకు కనిపించదో ఇది కూడా అలాంటిదే. మంగళవారం నాడు తెలంగాణ హై కోర్ట్ సిఎస్ సోమేష్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ కు వెళ్లాల్సిందే అని తేల్చిచెప్పింది. ఇంత కాలం క్యాట్ ఆర్డర్ తో సోమేష్ కుమార్ తెలంగాణ లో కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంతకాలానికి హై కోర్ట్ క్యాడర్ విషయం లో స్పష్టమైన తీర్పు ఇవ్వటం తో తెలంగాణ ఐఏఎస్ లు చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. అటు అధికారులతో పాటు..ఐఏఎస్ లను కూడా సోమేష్ కుమార్ ఇబ్బందులకు గురి చేసినట్లు ఐఏఎస్ ల్లో ప్రచారం ఉంది. తన వర్గానికి మాత్రమే పెద్ద పీట వేస్తూ ..మిగిలిన వాళ్ళు అందరిని లూప్ లైన్ లో పెట్టడం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారితో పాటు చాలా మంది ఐఏఎస్ లు సోమేష్ కుమార్ తీరు పై తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. కాకపోతే సీఎం కెసిఆర్ కు అయన అత్యంత సన్నిహితుడుగా ఉండటంతో ఎవరు ఏమి మాట్లాడలేని పరిస్థితి ఉంది.

ధరణి పోర్టల్ తో పాటు పలు విషయాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని సోమేష్ కుమార్ ప్రజల్లో చులకన చేశారనే విమర్శలు ఉన్నాయి. చాలా మంది మంత్రులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నా..సీఎం కెసిఆర్ ధరణి పోర్టల్ దేశానికే దిక్సూచి అంటూ పొగడ్తలు కురిపించటం తో వాళ్ళు మౌనం గా ఉండాల్సి వచ్చింది. కీలక శాఖలు అన్ని తన దగ్గరే పెట్టుకుని సోమేష్ కుమార్ చాలా మందిని ఇబ్బందులకు గురిచేశాడని చెపుతారు. ఒక్క కెసిఆర్ మాట తప్ప..అయన మరొకరి మాట వినకుండా ఒక మాటలో చెప్పాలంటే సొంత రాజ్యం గా నడిపించారని విమర్శలు ఉన్నాయి. అలా హై కోర్ట్ తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ కు వెళ్లాలని ఆదేశాలు ఇచ్చిందో లేదో డీఓపీటి వెంటనే ఆయన్ను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీచేయటం కూడా కలకలం రేపుతోంది. ఇది అంతా పొలిటికల్ గేమ్ ప్లాన్ లో భాగంగానే సడుతోందనే విమర్శలు కూడా ఉన్నాయి.

Next Story
Share it