కమ్యూనిస్టులకు కెసిఆర్ హ్యాండ్ ఇచ్చారా?
చెరి రెండు సీట్లు చాలు...ప్లీజ్ అన్నా కూడా కెసిఆర్ వీటిపై పెద్దగా స్పందించటం లేదు అని...ఏదైనా ఉంటే ఎమ్మెల్సీలు....మళ్ళీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ వాటిని అంశాలు పరిశీలిద్దాం కానీ సీట్లు కష్టం అనే సంకేతాలు పంపారు అనే ప్రచారం బిఆర్ఎస్ వర్గాల్లో నడుస్తోంది. అందుకు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకుని రెండు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాయి. శుక్రవారం నాడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు టిక్కెట్లు ఒకరు మాకు ఇచ్చేది ఏంటి...అవసరం ఉంది అనుకుంటే బిఆర్ ఎస్ పార్టీనే తమ దగ్గరకు వస్తుంది అని వ్యాఖ్యానించారు. లేదు అనుకుంటే ఎవరి దారి వారిదే అని తేల్చి చెప్పారు.ఇంత తక్కువ సమయంలోనే సాంబశివరావు ఇంత సీరియస్ కామెంట్స్ చేయటం పరిస్థితి కి అర్ధం పడుతుంది అని చెపుతున్నారు. రెండు సార్లు సొంతంగా అధికారంలోకి వచ్చిన తాము కమ్యూనిస్టులకు సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు అనే భావనలో బిఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు చెపుతున్నారు.