Telugu Gateway
Telangana

కెసిఆర్ కు బిగ్ షాక్...ఇక డబల్ 'ధమాకా'

కెసిఆర్ కు బిగ్ షాక్...ఇక డబల్ ధమాకా
X

ఎమ్మెల్యే ల ఎర కేసు లో కీలక పరిణామం. ప్రస్తుతం తెలంగాణ సర్కారు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్ ) ఈ కేసును విచారణ చేస్తుండగా...తెలంగాణ హై కోర్ట్ ఇప్పుడు ఈ కేసును సిబిఐ కి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇది ఖచ్చితంగా తెలంగాణ సర్కారు, ముఖ్యమంత్రి కెసిఆర్ కు బిగ్ షాక్ వంటి పరిణామంగా భావిస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో ముడిపడి ఉన్న కేసు కావటంతో మొత్తం వ్యవహారం ఇప్పుడు ఇక ఎన్ని మలుపులు తిరుగుతాయి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసు ను ఈడీ టేకప్ చేసింది. ఇదే అంశంపై ఒకసారి బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ని ఈడీ విచారించింది. ఇప్పుడు నంద కుమార్ స్టేట్ మెంట్ కూడా ఈడీ రికార్డు చేస్తోంది. ఈ తరుణంలో హై కోర్ట్ కేసు ను సిబిఐ కి అప్పగించటంతో ఈ విషయం కొత్త మలుపు తిరిగినట్లు అయింది.

దీంతో ఇప్పుడు కెసిఆర్ సర్కారుకు డబల్ ధమాకా ఖాయం అన్న చర్చ సాగుతోంది. ఈ కేసు ను సిబిఐ కి అప్పగించటానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా సరే అన్ని వైపులా వాదనలు విన్న తర్వాత హై కోర్ట్ తుది తీర్పు వెలువరించింది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దీనిపై మీడియా సమావేశం పెట్టి ఇందులోని అధారాలు అన్ని మీడియా కు రిలీజ్ చేయటం తో పాటు సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తుల తో పాటు అన్ని రాష్ట్రాల హై కోర్ట్ జడ్జిలకు పంపారు. అంతే కాదు..న్యాయమూర్తలకు దండం పెట్టి కోరుకుంటున్నానాని ..ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ కోరిన విషయం తెలిసిందే. అసలు ఒక ముఖ్యమంత్రి ఇలా అధారాలు నేరుగా జడ్జిలకు పంపటంపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఇప్పుడు హై కోర్ట్ కేసు ను సిబిఐ కి అప్పగించటంతో ఇది కీలక పరిణామంగా మారింది. ఒక వైపు కేసు సాగుతున్న సమయంలో కెసిఆర్ కు వీడియో లు...ఇతర సమాచారం అంతా ఎలా వచ్చింది అన్న అంశంపై కూడా సిబిఐ విచారణ సాగే అవకాశం ఉందని నిపుణులు చెపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హై కోర్ట్ తీర్పు పై సుప్రీం కోర్ట్ లో అప్పీల్ చేయనుంది.

Next Story
Share it