ఈటల ఫ్యామిలీకి హైకోర్టు షాక్
BY Admin27 May 2021 9:11 PM IST
X
Admin27 May 2021 9:11 PM IST
ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ లో అసైన్ మెంట్ భూముల విషయం నిగ్గుతేల్చేందుకు ఉద్దేశించిన సర్వేపై స్టేకు హైకోర్టు నిరాకరించింది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్, కరోనా ఉన్నందున సర్వేను జూన్ రెండవ వారం లేదా..మూడవ వారంలో మాత్రమే నిర్వహించాలని హైకోర్టు సూచించింది.
సర్వే వాయిదాకు అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ కూడా తన సమ్మతిని తెలిపారు. భూముల సర్వేను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈటల రాజేందర్ భార్య జమున కోర్టును ఆశ్రయించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Next Story