Telugu Gateway
Telangana

ఎన్నికల ముందు బిఆర్ఎస్ కు బిగ్ షాక్

ఎన్నికల ముందు బిఆర్ఎస్ కు బిగ్ షాక్
X

ఎన్నికల ముందు బిఆర్ఎస్ కు బిగ్ షాక్. రైతు బంధు విషయంలో బిగ్ ట్విస్ట్. ఇది ఎవరూ ఊహించని పరిణామం. తెలంగాణ ఆర్థిక మంత్రి, బిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు చేసిన ప్రకటన ఆ పార్టీ కొంప ముంచినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం రైతు బంధుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. బీజేపీ,బిఆర్ఎస్ కుమ్మక్కు అయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అయితే మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నేతలు రైతు బంధు ఆపటానికి ప్రయత్నించారు అని...కానీ సిఈసి రైతులకు ఈ మొత్తం అందచేయటానికి అనుమతి ఇచ్చింది అని ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు. వెంటనే ఇక నిధుల విడుదల ప్రారంభం అవుతుంది అని తెలిపారు. ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నాం...మళ్ళీ గెలిచిన తర్వాత మిగిలిన రుణ మాఫీ కూడా చేస్తామని ప్రకటించారు. సిఈసి నిర్ణయాన్ని అధికార బిఆర్ఎస్ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వాడుకోవాలని చూసింది. అయితే తాజాగా సీఈసి రైతు బంధు మంజూరుకు అనుమతి నిరాకరిస్తూ రాసిన లేఖలో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ ను ఉల్లఘించి మంత్రి హరీష్ రావు ప్రకటన చేసినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

హరీష్ రావు బిఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారని..అంతే కాకుండా అయన ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నందున ఇది మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ ను ఉల్లఘించటమే అని తేల్చిచెపుతూ ఇంతకు ముందు ఇచ్చిన అనుమతిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది రాజకీయంగా బిఆర్ఎస్ కు ఖచ్చితంగా ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. అయితే దీన్ని ఆ పార్టీ రాజకీయం ఎలా ట్విస్ట్ చేస్తుందో చూడాలి. అనుమతి ఇచ్చిన సమయంలోనే రాజకీయ నేతలు ఎవరూ ఇందులో భాగస్వాములు కావటానికి లేదు అని...నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేయాలనీ ఆదేశించింది. కానీ హరీష్ రావు ఎన్నికల ప్రచార సభల్లో చేసిన వ్యాఖ్యలు మీడియా లో కూడా పెద్ద ఎత్తున కవరేజ్ వచ్చింది. దీంతో సీఈసి ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story
Share it