పోలీసు కస్టడీకి అఖిలప్రియ
మాజీ మంత్రి అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురు అయింది. ఆమె బెయిల్ పిటీషన్ ను సికింద్రాబాద్ కోర్టు తోసిపుచ్చింది. ఆమెను మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ఓ భూవివాదానికి సంబంధించిన జరిగిన కిడ్నాప్ కేసులో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయాల్సి ఉండటంతోపాటు ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు నివేదించారు.
మొదటి నుంచి పోలీసులు ఆమె బెయిల్ పిటీషన్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అఖిలప్రియ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించటంతోపాటు ఆమెను పోలీసులు కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం సేకరించే అవకాశం ఉంది. అంతే కాదు..కిడ్నాప్ చేసిన వ్యక్తుల నుంచి ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకున్నారని..వాటిని కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు.