భూమా అఖిలప్రియ విడుదల
BY Admin23 Jan 2021 2:14 PM

X
Admin23 Jan 2021 2:14 PM
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ శనివారం సాయంత్రం చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. కిడ్నాప్ కేసులో ఆమె ఏ1 నిందితురాలుగా ఉన్న విషయం తెలిసిందే. సికింద్రాబాద్ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయటంతో ..ఆమె శనివారం నాడు జైలు నుంచి బయటకు వచ్చారు. ఆమె 15 రోజులకొక సారి బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాల్సి ఉంటుంది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఆమె 18 రోజులుగా జైలులోనే ఉన్నారు. అఖిల ప్రియ విడుదలతో నంద్యాల, ఆళ్ళగడ్డ నుంచి వచ్చిన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 19 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Next Story