వైఎస్ కు భారతరత్న ఇవ్వాలి
BY Admin8 July 2021 2:26 PM IST
X
Admin8 July 2021 2:26 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తొలిసారి కీలక డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాగిత్యాలలో వైఎస్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుజాతికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహా నాయకుడు వైఎస్ఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు బాట వేసిన నాయకుడు. ఏపీ, తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులకు ఆద్యుడు అయిన వైఎస్ కు భారతరత్న ప్రకటించేలా ఏపీ, తెలంగాణ సీఎంలు కేంద్రాన్ని కోరాలన్నారు.
Next Story