Telugu Gateway
Telangana

హైదరాబాద్ ఎయిర్ పోర్టు లో వెరైటీ విమానం

హైదరాబాద్ ఎయిర్ పోర్టు లో వెరైటీ విమానం
X

తిమింగలం తరహాలో ఉండే ఎయిర్ బస్ బెలుగా హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. తాజాగా ఈ విషయాన్నీ జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వెల్లడించింది. ఈ ఎయిర్ బస్ బెలుగా అతిపెద్ద పరిమాణంలో ఉండే ఎయిర్ కార్గో రవాణాకు ఉపయోగిస్తారు. ఈ ఆకాశ తిమింగళానికి మరో సారి ఆతిధ్యం ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అని వెల్లడించారు.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐదు ఎయిర్ బస్ బెలుగాలు ఉన్నాయి.

ప్రధానంగా వీటిని ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలతో పాటు అతి పెద్ద కార్గో రవాణాకు ఉపయోగిస్తారు. 1994 సెప్టెంబర్ లో తొలి ఎయిర్ బస్ బెలుగా అందుబాటులోకి వచ్చింది. ఇది గంటకు 864 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలడు. ఎయిర్ బస్ బెలుగా బరువు 86500 కేజీలు.అతిపెద్ద ప్రయాణికుల విమానం అయిన ఏ 380 విమానాలు రాకపోకలు సాగించేందుకు అవసరం అయిన కోడ్ ఎఫ్ రన్ వే కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. అయినా ఇప్పటివరకు ఏ ఎయిర్ లైన్స్ కూడా ఈ సర్వీస్ లను ప్రారంభించలేదు.

Next Story
Share it