Telugu Gateway
Telangana

కెన‌డా హాలిప్యాక్స్ లో బ‌తుక‌మ్మ వేడుక‌లు

కెన‌డా హాలిప్యాక్స్ లో బ‌తుక‌మ్మ వేడుక‌లు
X

తెలంగాణ ఆడపడుచులు అత్యంత ఘనంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలు కెనడా లోని హాలిఫ్యాక్స్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మ్యారిటైం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బెడ్ఫోర్డ్ హామండ్స్ ప్లేయిన్స్ కమ్యూనిటీ సెంటర్ లో తిరొక్కతీరు పూలతో 8 అడుగుల ఎత్తయిన బతుకమ్మను బతుకమ్మ ను పేర్చి తెలంగాణ ఆడపడుచులు అంతా ఒకచోట చేరి బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో తెలుగు ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనడం పట్ల అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Next Story
Share it