Telugu Gateway
Telangana

చంద్ర‌బాబుకు ప‌ట్టిన గ‌తే కెసీఆర్ కూ

చంద్ర‌బాబుకు ప‌ట్టిన గ‌తే కెసీఆర్ కూ
X

అరెస్ట్..విచార‌ణ‌ల భ‌యంతోనూ ఈ లొల్లి అంతా

బండి సంజ‌య్

తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గిట్లనే చేసిండు. చివరకు ఆయనకు ఏ గతి పట్టిందో నీకూ అదే గతి పడుతుందని హెచ్చ‌రించారు. దేశంలోనే నెంబర్ వన్ అవినీతి పరుడు కేసీఆర్ అని ఆరోపించారు. అత్యంత అవినీతికి పాల్పడింది కేసీఆర్ కుటుంబమే... కేసీఆర్ కుటుంబ ఆస్తులు చూస్తే ఎవరికైనా అర్ధమైతది. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్, ఆయన ఫ్యామిలీ ఆస్తులెన్ని? ఈరోజు ఆస్తులెన్ని.... ఇప్పుడు కేసీఆర్ కు ఓ ఫాం హౌజ్, బిడ్డకు ఓ ఫాంహౌజ్, అల్లుడుకు ఓ ఫాంహౌజ్ లున్నయ్... ఇగ కొడుకుకైతే రెండు మూడు ఫాంహౌజ్ లు, ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లున్నయట. దుబాయ్ లో, సింగపూర్ లో, అమెరికా, లండన్ కు పోయి దోచుకున్నదంతా దాచుకుంటున్నరట. మరి గిన్ని పైసలు యాడికెళ్లి వచ్చినయ్? ఈ అవినీతిపై కేంద్ర నిఘా సంస్థలు ఫోక‌స్ పెట్టినయ్. త్వరలో ఎంక్వైరీ స్టార్ట్ షురూ కాబోతోంది. ఈ విషయం తెలిసినప్పటి నుండి తండ్రీ, కొడుకు, అల్లుడు ఫ్రస్టేషన్ కు పోయిండ్రు. గాయి గాయి చేస్తుండ్రు. కొడుకు ఏం మాట్లాడుతుందో... ఆయన నాలుకకు, మెదడుకు లింకు లేకుండా పోయింది. ఇగ ఈ పెద్ద మనిషి ఒకటే డిసైడ్ అయ్యిండు. వీళ్లెట్లాగూ నన్ను అరెస్ట్ చేస్తరు. అంతకంటే ముందే లొల్లి చేస్తే ఓ పనైపోతదని తెలిసి ఫెడరల్ ఫ్రంట్ అని ముందేసుకున్నడు. కేసీఆర్ ఇయ్యాల మీటింగ్ లో చెప్పిన మాటలు చూస్తే... అని కార్పొరేట్ సంస్థలు టెన్త్, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు టీవీల్లో 1...2...3..4...5 ర్యాంకులు మావే అని యాడ్లు ఇచ్చినట్లుంది. ఏ సభకు వెళ్లినా కోట్లు కోట్లు కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించుడు... ఆ తరువాత పైసలు రావు.. జీవో రాదు. హుజూర్ నగర్, సాగర్, దుబ్బాక, హుజూరాబాద్ సహా జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు గిట్లనే చెప్పిండు. పైసా ఇవ్వలేదు. ఆయన మాటలు నమ్మితే అంతే సంగతులు.. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనం కేసీఆర్ గూబ గుయ్ మన్పించినా సిగ్గు రావడం లేదు.

అవినీతితో దోచుకున్న సొమ్మును దాచుకునేందుకు ఇదంతా... తనపై కేంద్రం కేసులు పెడితే మిగితా రాష్ట్రాల సీఎం, నాయకుల అండగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో కేసీఆర్ ఈ డ్రామా అంతా చేస్తుండు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, బెంగాల్ ఫ్రజలందరికీ నా విజ్ఝప్తి. ఈ దోకేబాజీని నమ్మొద్దు... నమ్మినోళ్ల గొంతు కోస్తడు..... తెలంగాణ ఉద్యమంలో 1400 మంది చనిపోతే అందులో సగం మందిని కూడా గుర్తించి సాయం చేయని దుర్మార్గుడు కేసీఆర్.... తెలంగాణ రావడానికి కారణమైన ఉద్యోగ, నిరుద్యోగ, సబ్బండ వర్ణాలను మోసం చేసిండు ఈ కేసీఆర్. తెలంగాణ ప్రజలకు మళ్లా మళ్లా విజ్ఝప్తి చేస్తున్నా.... కేసీఆర్ దోచుకున్న కోట్ల రూపాయలు కక్కించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఆయనను జైలుకు పంపించడం ఖాయం. ఇది తెలిసే కేసీఆర్ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. ఇగ రాష్ట్రం బంగారు తెలంగాణ అయ్యిందంట. భారత దేశాన్ని బంగారు భారత్ చేస్తాడట. రాష్ట్రం బంగారు తెలంగాణ అయ్యిందా..... ఆత్మహత్యల తెలంగాణ అయ్యింది. ... దోపిడీ దొంగల తెలంగాణ అయ్యింది. తెలంగాణ ఎంత బాగైంది తెలుసా... నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నరు. చివరకు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. చివరకు తెలంగాణలో అత్మహథ్యలను మాత్రమే బాగు చేసుకుంటున్నడు అంటూ మండిప‌డ్డారు.

Next Story
Share it