Top
Telugu Gateway

కుట్ర సమాచారం ఉంటే అరెస్ట్ చేయాలి..మీడియా ప్రకటన ఇస్తారా?

కుట్ర సమాచారం ఉంటే అరెస్ట్ చేయాలి..మీడియా ప్రకటన ఇస్తారా?
X

ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేలా కెసీఆర్ మాటలు

హైదరాబాద్ లో అల్లర్లకు ఎవరు కుట్ర చేస్తున్నారో ముఖ్యమంత్రి కెసీఆర్ పక్కా సమాచారం ఉంటే వారిని అరెస్ట్ చేసి లోపల వేయాలి కానీ..మీడియాకు ప్రకటనలు ఇస్తారా? అని బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ ప్రశ్నించారు. అది బిజెపి, టీఆర్ఎస్, ఎంఐఎం ఎవరైతే అల్లర్లకు ప్రయత్నిస్తున్నారో వారిని అరెస్ట్ చేసే అధికారం ఉందన్నారు. అంత పక్కా సమాచారం ఉంటే చర్యలు తీసుకోకుండా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారంటే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి..ఓటింగ్ కు రాకుండా చేసే కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం అవుతోందని అన్నారు. బండి సంజయ్ గురువారం నాడు పీ వీ ఘాట్ వద్ద మాజీ ప్రధాని నరసింహరావుకు నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశ మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగు జాతి గౌరవానికి ప్రతీకలను బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు గర్వించదగ్గ గొప్పవారిని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా వారిని అందరూ గౌరవిస్తారని గుర్తుచేశారు. మహానేతలపై ఒవైసీ మాట్లాడిన తీరు దురదృష్టకరమని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే స్పందించి అతన్ని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ను కూల్చివేస్తామంటూ ఎంఐఎం నేతలు చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌, టీడీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీ దేశ ద్రోహ పార్టీగా ముస్లీంలే భావిస్తున్నారు. న్టీఆర్ స్కూల్ నుంచే వచ్చి ఈ రోజు సీఎం అయిన కేసీఆర్.. అభిమాన నాయకుడిని అవమనిస్తే ఎందుకు సీఎం స్పందించడం లేదు. రోహింగ్యాలను ప్రభుత్వం గుర్తించినట్లు భావిస్తున్నాం. ప్రశాంతంగా గ్రేటర్ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు సంజయ్.

Next Story
Share it