Telugu Gateway
Telangana

తెలంగాణ‌లో విద్యా వ్య‌వ‌స్థ నిర్వీర్యం

తెలంగాణ‌లో విద్యా వ్య‌వ‌స్థ నిర్వీర్యం
X

తెలంగాణ‌లో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను వెంట‌నే భర్తీ చేయాలి బిజెపి రాష్ట్ర ప్రెసిడెంట్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. టీచర్ పోస్టులను భర్తీ చేయకపోవడంవల్ల విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. విద్యారంగంలో తెలంగాణ 18వ స్థానంలో ఉండటమే నిదర్శనం అని పేర్కొన్నారు. బండి సంజయ్ సోమ‌వారం నాడు ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. బీఈడీ, డీఈడీ, పండిట్ శిక్షణ, పీఈటీ పూర్తి చేసిన టీచర్ పోస్టుల 7 లక్షల మంది నిరుద్యోగులు నిరాశలో ఉన్నార‌న్నారు.

టీచర్లు లేక విద్యార్థులకు పాఠాలు చెప్పే నాథుడే కరువయ్యార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. గత ఐదేళ్లుగా టెట్ పరీక్షలు నిర్వహించకపోవడంతో యువత నిరాశలో కూరుకుపోయాయ‌ని తెలిపారు. మైనారిటీ, ఎయిడెడ్ సంస్థల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌న్నారు. యుద్ద ప్రాతిపదికన ఖాళీ పోస్టులను భర్తీ చేసి విద్యారంగాన్ని రక్షించాలని సంజ‌య్ డిమాండ్ చేశారు.

Next Story
Share it