Telugu Gateway
Telangana

ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలకు బిజెపి డెడ్ లైన్

ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలకు బిజెపి డెడ్ లైన్
X

తెలంగాణ‌లో ఉద్యోగ ఖాళీల భ‌ర్తీకి సంబందించి బిజెపి ప్ర‌భుత్వానికి డెడ్ లైన్ విధించింది. జ‌న‌వ‌రి నెలాఖ‌రులోపు నోటిఫికేష‌న్లు ఇవ్వ‌క‌పోతే అసెంబ్లీని ముట్ట‌డిస్తామ‌ని..లేదంటే బిజెపి స‌త్తా ఏంటో చూపిస్తామ‌ని హెచ్చ‌రించారు.నిరుద్యోగులు ఎవ‌రూ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్ద‌ని..బిజెపి వాళ్ల‌కు అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే... ఇదే చివరి ఉద్యమం కావాలని వ్యాఖ్యానించారు. కేటీఆర్.... నీ అయ్యదే దొంగ దీక్ష..మావద్దు .ఆధారాలు ఉన్నయ్ అంటూ సంజయ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాల్లారా.... సీఎం అంటే మీకెందుకంత భయం?. సీఎం నిర్ణయంతో ఉద్యోగులంతా అల్లాడుతున్నా స్పందించరా?. కేసీఆర్ ను తరిమికొట్టండి... మీ తరపున మేం ఉద్యమిస్తాం అంటూ పిలుపునిచ్చారు. బీజేపీ 'నిరుద్యోగ దీక్ష' ముగిసిన త‌ర్వాత బండి సంజ‌య్ మాట్లాడారు. 'జనవరి లోపు నోటిఫికేషన్ ఇవ్వాలి. లేనిపక్షంలో రాబోయే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుని తీరతాం. మా 'ట్రిపుల్ ఆర్' ఎమ్మెల్యేలు (రాజాసింగ్, రఘునందన్, రాజేందర్) నోటిఫికేషన్ ఇచ్చేదాకా సభ జరగనీయకుండా అడ్డుకుంటారు.

మా బీజేపీ కార్యకర్తలతో అసెంబ్లీని దిగ్బంధిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ జరపనీయం' అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు సంజ‌య్. 'నిరుద్యోగ దీక్ష'ను దొంగ దీక్షగా అభివర్ణిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'తెలంగాణ ఉద్యమంలో నీ అయ్యది దొంగ దీక్ష. బాత్రూంలోకి పోయి ఇడ్లీలు తిన్న నీచపు బతుకు నీ అయ్యది. తెలంగాణ రాకపోయినా... గంగలో పడ్డా నాకక్కర్లేదు. ఖమ్మంలో జ్యూస్ గ్లాస్ గుంజుకుని తాగి దొంగ దీక్ష చేసిన చరిత్ర నీ అయ్యది. ఢిల్లీలో 48 గంటల దీక్ష చేస్తానని చెప్పి 10 గంటలు కూడా చేయకుండా మధ్యలోనే వెళ్లి పోయి తాగి సోయితప్పి పండుకున్న చరిత్ర నీ అయ్యది''అంటూ మండిప‌డ్డారు. నిరుద్యోగ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు అడుగడుగునా నిర్బంధాలు కొనసాగించినా... ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు చేసినా... వాటిని ధీటుగా ఎదుర్కొని వేలాది మంది నిరుద్యోగులు నిరుద్యోగ దీక్షకు తరలివచ్చి బండి సంజయ్ కు సంఘీభావం తెలిపారు.

Next Story
Share it