గవర్నర్ ను గౌరవించలేని సంస్కారహీనులు
తెలంగాణ సర్కారుపై బిజెపి రాష్ట్ర ప్రెసిడెంట్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి ధర్మపురి అరవింద్ పై నిజామాబాద్ సీపీ నేతృత్వంలో, సీఎంవో డైరెక్షన్‌లో హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. ఎంపీపై దాడి విషయంలో ఎవరూ మాట్లాడలేదన్నారు. ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్ కాలేదన్నారు. ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్‌ను గౌరవించలేని సంస్కార హీనులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిక్కచ్చిగా పనిచేసే వారు మన గవర్నర్ అని, మాతో కూడా రాజకీయాలు మాట్లాడవద్దని గవర్నర్ చెప్పారని ఆయన అన్నారు. ఇప్పటికైనా సీఎం స్పందించాలన్నారు. వెంటనే సీపీపై కేసు నమోదు చేయాలన్నారు.
దాడి చేసిన వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ కార్యకర్తలుగా ఉన్నందుకు తాము గర్వపడుతున్నామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సంవత్సరం మాత్రమే ఉంటుందని, తర్వాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ తెలిపారు. నందిపేట్‌లో గురువారం నాడు ఎంపీ అరవింద్ ను ఆయన పరామర్శించారు. ఆర్మూర్ దాడి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఐపీఎస్ అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పని చేయలేకపోతున్నామని బాధ పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.