బజాజ్ ఎలక్ట్రానిక్స్ చీటింగ్!

కానీ కంపెనీ ఇంకా గత కొన్ని రోజులుగా ఇస్తున్నయాడ్స్ లో మాత్రం ఇంకా కోటి రూపాయల నగదు అంటూ కొనుగోలు దారులను చీటింగ్ చేస్తుంది అనే ఆరోపణులు వస్తున్నాయి. మళ్లీ అదే యాడ్స్ లో 30 లక్షల రూపాయల డ్రా ఎప్పుడు, 50 లక్షల రూపాయల డ్రా ఎప్పుడు అన్న డేట్స్ ఇస్తుంది. కానీ యాడ్ లో మాత్రం కోటి రూపాయల నగదు అని మోసం చేస్తుంది. అయి పోయిన 20 లక్షలను మినహాయించి చెప్పాల్సి ఉండగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ మాత్రం కొనుగొలు దారులను తన ప్రకటనల ద్వారా తప్పు దారి పట్టిస్తోందని విమర్శలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇస్తున్న యాడ్స్ అన్నింట్లో కోటి రూపాయల నగదు బహుమతి అని చెపుతూ వస్తోంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ యాడ్స్ ప్రజలను..ముఖ్యంగా వినియోగదారులను మోసం చేసేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతి ఏటా బజాజ్ ఎలక్ట్రానిక్స్ పండగల సమయంలో ఇలా యాడ్స్ ఇస్తూ కొనుగోలు దారులను ఆకట్టుకొంటుంది. ఎంత లాభం లేక పోతే ఈ కంపెనీ కొన్ని నెలల వ్యవధి లో కోటి రూపాయల నగదు బహుమతులు ఇవ్వటం సాధ్యం అవుతుంది అని ఒక వ్యాపారి ప్రశ్నించారు. ఇటీవల కాలంలో ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించి మార్కెట్ నుంచి 500 కోట్ల రూపాయలు సమీకరించింది. ఇది అందరికి తెలిసిన విషయమే. దసరా, దీపావళి పండగల సందర్భంగా భారీ ఆఫర్స్ ప్రకటించింది. ఏకంగా కోటి రూపాయల నగదు బహుమతి అంటూ గత కొంత కాలంగా భారీ ఎత్తున ప్రకటనలు ఇస్తోంది.