Telugu Gateway
Telangana

బిట్స్ పిలానీ, యాక్సిస్ బ్యాంకు ఒప్పందం

బిట్స్ పిలానీ, యాక్సిస్ బ్యాంకు ఒప్పందం
X

హైదరాబాద్ కు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రాబోతోంది. రెండు దిగ్గజ సంస్థలు ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడుతున్నాయి. ఇందులో ఒకటి బిట్స్ పిలానీ..హైదరాబాద్ క్యాంపస్ అయితే..మరొకటి ప్రైవేట్ రంగంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంకు. ఈ రెండు సంస్థలు కలిసి హైదరాబాద్ లో 100 కోట్ల రూపాయల పెట్టుబడితో 'ఇండస్ట్రీ రీసెర్చ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్‌ పార్కు'ను అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు బుధవారం నాడు రెండు సంస్థలు ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. పారిశ్రామిక పరిశోధన మరియు సాంకేతికతను పెంపొందించడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం.

ఈ ప్రాజెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్స్, లాజిస్టిక్స్, సప్లై చైన్ వంటి భవిష్యత్తును శాసించే రంగాలలో నూతన ఆవిష్కరణలకు ఇది ఊతమిస్తుంది అని భావిస్తున్నారు. .ఉపాధి, పరిశోధనా విద్యార్థులకు, పరిశోధకులకు ఇండస్ట్రీ-లెవల్ శిక్షణ, పరిశోధనా అవకాశాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా లభించనున్నాయి. దేశంపై శాశ్వత ప్రభావం చూపించే పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధి కోసం విద్య, పరిశ్రమల అధినేతలు ముందుకు రావటం మంచి పరిణామంగా బిట్స్ పిలానీ ఛాన్సలర్ కుమార మంగళం బిర్లా అభివర్ణించారు.

Next Story
Share it