బిజెపి ఎంపీ అరవింద్ కాన్వాయ్ పై దాడి
BY Admin15 July 2022 8:15 AM GMT
X
Admin15 July 2022 8:15 AM GMT
బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కు మరోసారి నిరసన సెగ తగిలింది. ఆయన కాన్వాయ్ ను గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అరవింద్ ఎద్దండికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంపీ కాన్వాయ్‌తో పాటు మరో రెండు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. భారీ భద్రత నడుమ బీజేపీ ఎంపీ కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపించివేశారు. వరదల విషయంలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్న తరుణం చోటుచేసుకుంది. అయితే తనపై దాడికి పాల్పడింది టీఆర్ఎస్ కార్యకర్తలే అంటున్నారు ఎంపీ అరవింద్.
Next Story