Telugu Gateway
Telangana

తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్ లకు నో ఎంట్రీ!

తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్ లకు నో ఎంట్రీ!
X

కరోనా ఇప్పుడు రాష్ట్రాల మధ్య కూడా సమస్యలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ ల ను తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకుంటున్నారు. ఏపీలో కరోనా కేసులు పెద్ద ఎత్తున ఉన్నందున హైదరాబాద్ లో ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతి ఉంటే తప్ప..అంబులెన్స్ లను కూడా అనుమతించబోమని పోలీసులు చెబుతున్నారు. కోవిడ్ పేషేంట్స్ అనుమతిపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. తెలంగాణలో ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్సులకు అనుమతి ఇస్తున్నారు. ఆంధ్రా బోర్డర్ దగ్గర వెనక్కి తిప్పి పంపుతున్న తెలంగాణ పోలీసులు. సాధారణ వాహన ప్రయాణికులను మాత్రం అనుమతిస్తున్న తెలంగాణ పోలీసులు. హైదరాబాద్ లో కూడా పడకలు, ఆక్సిజన్ కొరత ఉందని అందుకే నిలిపివేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ వ్యవహారం రాజకీయ దుమారం కూడ రేపుతోంది. తెలంగాణ పోలీసుల తీరుపై ఏపీకి చెందిన రాజకీయ నేతలు తప్పుపడుతున్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏ మాత్రం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సీఎం కెసీఆర్ జోక్యం చేసుకుని అంబులెన్స్ లను అనుమతించేలా చూడాలన్నారు. ఏపీ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. హైదరాబాద్ పదేళ్ల వరకూ ఉమ్మడి రాజధాని అని..ఉమ్మడి రాజధానిలో మూడేళ్ల వరకూ ఇంకా మౌలికసదుపాయాలు వాడుకునే అవకాశం ఉందని ..అసలు వైద్యానికి సంబంధించి ఎల్లలు లేవన్నారు. ఈ సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని విష్ణువర్ధన్ రెడ్డి పోలీసులకు సూచించారు.

Next Story
Share it