Telugu Gateway
Telangana

హాట్ టాపిక్ ఆంధ్ర జ్యోతి వ్యవహారం!

హాట్ టాపిక్ ఆంధ్ర జ్యోతి వ్యవహారం!
X

బిఆర్ఎస్ సర్కారు..ముఖ్యంగా సీఎం కెసిఆర్ గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర జ్యోతిని టార్గెట్ చేశారు. ప్రధానంగా ఆంధ్ర జ్యోతికి ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకుండా వేధించారు. ఈ మద్యే రిటైర్డ్ ఐఏఎస్ చంద్రవదన్ సంచనలన విషయాలు వెల్లడించినట్లు ఆ పత్రికలోనే వార్త వచ్చింది. దాని సారాంశం ఏమిటి అంటే ఆంధ్ర జ్యోతి పత్రిక తో పాటు ఆంధ్ర జ్యోతి సంస్థలను తొక్కేయమని కెసిఆర్ ఆదేశించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన పత్రికలు అన్ని కెసిఆర్ అంటే సాగిలబడిన దశలో ఆంధ్ర జ్యోతి ఒక్కటే నిటారుగా నిలబడి చాలా రోజులు పోరాటం చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టింది. ఈ విషయం తట్టుకోలేక కొద్ది రోజుల క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా సీఎం కెసిఆర్ ఆంధ్ర జ్యోతి పేరు ప్రస్తావించకుండానే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిన్న మొన్నటి వరకు తెలంగాణాలో అసలైన ప్రతిపక్షం అంటే ఆంధ్ర జ్యోతే అనేలా పరిస్థితి ఉండేది. కానీ గత పక్షం రోజులుగా పత్రికలో వచ్చిన మార్పు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అనే చెప్పాలి. ఆంధ్ర జ్యోతి పత్రికలో ఆ పాత కసి...ఉత్సాహం ఉండి ఉంటే కెసిఆర్ సర్కారు దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయలు పెట్టి కట్టామని చెపుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం అయిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల లో పగుళ్లు అంశాన్ని దుమ్ము రేపేది అని..కానీ ఈ విషయం లో ఆంధ్ర జ్యోతి అంతగా ఫోకస్ పెట్టడం లేదు అనే విషయం స్పష్టం అయిపోతోంది అనే చర్చ సాగుతోంది. పిల్లర్లు కుంగింది..బ్యారేజ్ కు అక్కడక్కడ క్రాక్ లు వచ్చింది కేవలం డిజైన్ల లోపం వల్లే తప్ప నిర్మాణ లోపం వల్ల కాదు అని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయినా సరే మంత్రి కేటీఆర్ దగ్గర నుంచి అధికారులు..ఇంజనీర్లూ ఈ ఖర్చు అంతా నిర్మాణ సంస్థే భరిస్తుంది అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. డిజైన్లు ఇచ్చింది ప్రభుత్వం.

వాటి ప్రకారమే నిర్మాణ సంస్థ పని పూర్తి చేసింది. అప్పుడు కంపెనీకి బాధ్యత ఎలా ఉంటుంది. ఆంధ్ర జ్యోతి పాత లైన్ లో ఉండి ఉంటే ఈ విషయాన్నీ ఒక రేంజ్ లో ఆడుకునేది అని...కానీ ఇప్పుడు అకస్మాత్తుగా దూకుడు తగ్గించటం..అది కూడా అత్యంత కీలకమైన ఎన్నికలకు నెల రోజుల ముందు స్టాండ్ మార్చుకోవటం అన్నది చర్చనీయాంశగా మారింది. మంగళవారం నాడు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కూడా తెలంగాణాలో కెసిఆర్ సర్కారు మీడియాను నియంత్రణలో పెట్టుకుంది అని ఆరోపించిన విషయం తెలిసిందే. గత ఐదేళ్ల కాలంలో ఏ పత్రిక అయినా కొంత ప్రభుత్వ వ్యతిరేక వార్త రాస్తే అది వంద శాతం వాస్తవాలతో ఉన్నా కూడా ఆయా పత్రికలకు వెంటనే యాడ్స్ ఆపేయమంటూ ఒక కీలక మంత్రి ఆదేశించటం అది వెంటనే అమల్లోకి రావటం జరిగేది. ఒక పక్క రాష్ట్రంలో మీడియాను పూర్తిగా చెప్పు చేతల్లో పెట్టుకుని...మరో వైపు కేంద్రంలో మోడీ సర్కారు మీడియా ను అణిచివేస్తుంది అనే విమర్శలు చేయటం బిఆర్ఎస్ నేతలకే చెల్లింది. అయితే ప్రభుత్వ,బిఆర్ఎస్ వ్యతిరేక స్టాండ్ కు బై బై చెప్పినా పొలిటికల్ కవరేజ్ విషయంలో విపక్షాలకు కూడా స్పేస్ ఇచ్చే విషయంలో మాత్రం ఆంధ్ర జ్యోతి ఇప్పటికే బెటర్ అని చెప్పొచ్చు. కానీ స్టాండ్ మార్పు విషయం మాత్రం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది అనే చెప్పాలి.

Next Story
Share it