Telugu Gateway
Telangana

కిడ్నాప్ కేసులో అఖిలప్రియే ప్రధాన సూత్రదారి

కిడ్నాప్ కేసులో అఖిలప్రియే ప్రధాన సూత్రదారి
X

బోయినపల్లి కిడ్నాప్ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు జరిగాయి. పోలీసులు ఈ కేసు సంబంధించి కొత్తగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులకు సంబంధించి వాడిన వాహనాల నెంబర్ ప్లేట్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ ప్రధాన సూత్రదారి అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. 'మల్లికార్జున్‌రెడ్డి, సంపత్‌కుమార్, అఖిలప్రియ పీఏ బాలచెన్నయను అరెస్ట్ చేశాం. నిందితులు ఫేక్ నంబర్ ప్లేట్లు ఉన్న కార్లను వాడారు. కిడ్నాప్‌ చేయడానికి ముందు నిందితులు మియాపూర్‌లో ఆరు సిమ్‌ కార్డులు కొన్నారు.

వీటిలో 70956 37583 నంబర్‌ని అఖిలప్రియ వాడారు. మల్లికార్డున్‌రెడ్డి ద్వారా 6 సిమ్‌లు, మొబైల్స్ కొనుగోలు చేశారు. కిడ్నాప్‌నకు ముందు నిందితులు రెక్కి నిర్వహించారు. భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను పథకం ప్రకారం కిడ్నాప్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 19 మంది పాత్ర ఉంది' అని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ఇద్దరు మహిళా అధికారుల సమక్షంలో అఖిలప్రియని అరెస్ట్ చేశామని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఆమెకు అన్నివైద్య పరీక్షలు చేయించాం. అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని రిపోర్టుల్లో వచ్చింది. మెడికల్ రిపోర్టును కోర్టుకు సమర్పించాం అని సీపీ తెలిపారు.

Next Story
Share it