Telugu Gateway
Telangana

సిద్ధిపేటకు ఎయిర్ పోర్ట్ ఛాన్స్..కెసీఆర్

సిద్ధిపేటకు ఎయిర్ పోర్ట్ ఛాన్స్..కెసీఆర్
X

ముఖ్యమంత్రి కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధిపేటకు విమానాశ్రయం వచ్చే ఛాన్స్ ఉందని ప్రకటించారు. 'సిద్దిపేట డైనమిక్ ప్రాంతం... రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఎయిర్ పోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి' అన్నారు. ఎప్పటి నుంచో నానుతున్న వరంగల్ ఎయిర్ పోర్టే ఇంత వరకూ రెడీ కాలేదు. గతంలో కొత్తగూడెంతోపాటు ఆదిలాబాద్ ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాలు ప్రతిపాదనలు ఉన్నాయి.

అవి ఏమయ్యాయో తెలియదు కానీ...కెసీఆర్ సడన్ గా సిద్ధిపేటలో విమానాశ్రయం అని ప్రకటించారు. సీఎం కెసీఆర్ గురువారం నాడు సిద్ధిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతు వేదికతోపాటు తెలంగాణ భవన్ లను ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో కలిసి రూ.22 లక్షలతో మిట్టపల్లి గ్రామంలో నిర్మించిన రైతు వేదిక కు ప్రారంభోత్సవం చేశారు.

Next Story
Share it