Telugu Gateway
Telangana

ఆహా ఓటిటి లో గోదారి పై డాక్యుమెంటరీ

ఆహా ఓటిటి లో గోదారి పై డాక్యుమెంటరీ
X

ఒక నది ...అది ఎక్కడ పుట్టి...ఎక్కడెక్కడో తిరిగి తిరిగి అంతిమంగా ఎక్కడకు చేరుకుంటుంది....ఈ నది మధ్యలో ఉండే విశేషాలు, ఆ నది పరివాహక ప్రాంతంలో ఉండే జీవన చిత్రాలు తెలియచెప్పే డాక్యుమెంటరీనే ఆహా "గోదారి". ఐదు రాష్ట్రాలు...ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు గోదావరి నది ఎంతో కీలకం అన్న విషయం తెలిసిందే. 1400 వందల కిలోమీటర్ల మేర ప్రయాణించే గోదావరి నది విశేషాల సమాహారమే ఈ ఆహా గోదావరి. శ్రీరామనవమి అంటే మార్చి 30 నుంచి ఇది ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.స్వాతి దివాకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రివ్యూ షో బుధవారం నాడు ప్రసాద్ లాబ్స్ లో వేశారు. దీనికి సంబదించిన విశేషాలను మీడియా కు వివరించారు. త్రియంబక్ లో మొదలయ్యే గోదావరి నది అలా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ చివరికి అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుందనే విషయం తెలిసిందే.

తన ప్రవాహ ప్రయాణంలో వివిధ రకాల ప్రాంతాలు, మనుషులు, యాసలు, భాషలు, పుణ్యక్షేత్రాలను పలకరిస్తూ, పరవశిస్తూ వారి జీవితాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నది గోదారి. ఈ ఆహా గోదారి డాక్యుమెంటరీ ఆహా ఓటీటీ విపణికి ఒక మైలురాయి నిలవనుంది. వినోద రంగంలో సంప్రదాయ వినోద కార్యక్రమలు కాకుండా, ఈ తరహా డాక్యుమెంటరీలు మరిన్ని వచ్చేందుకు ‘ఆహా గోదారి’ దోహదపడుతుందనడంలో సందేహాం లేదు. ఇలాంటివాటి వల్ల మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అత్యద్భుతమైన ప్రాచీన కట్టడాల గురించి ప్రేక్షకులకు వివరించే అవకాశం ఉంటుందని ఆహా యాజమాన్యం తెలిపింది.

Next Story
Share it